ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన రోజుల్లో శని ప్రదోష వ్రతానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడితో పాటు శని దేవుని అనుగ్రహాన్ని ఒకే రోజు పొందేందుకు ఈ పర్వదినం అత్యంత ప్రశస్తమైనదిగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ 27, శనివారం నాడు శని ప్రదోష వ్రతం రానుంది. జాతకంలో శని దోషాలు ఉన్నా, ప్రస్తుతం శని దేవుడి ప్రతికూల సంచారం వల్ల ఇబ్బందులు పడుతున్నా.. ఈ రోజున చేసే చిన్న చిన్న పరిహారాలు అపారమైన ఉపశమనాన్ని ఇస్తాయి.

ప్రస్తుత గ్రహాల స్థితిని బట్టి చూస్తే కొన్ని రాశుల వారు శని ప్రభావం వల్ల ఒత్తిడి, పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మేష రాశి, కుంభ రాశి, మీన రాశి వారు ప్రస్తుతం ఏల్నాటి శని (సడే సతి) ప్రభావంతో ఉన్నారు. అదే సమయంలో సింహ రాశి, ధనుస్సు రాశి వారు శని ధైయా (అర్థాష్టమ లేదా అష్టమ శని) ప్రభావం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ఐదు రాశుల వారు శని ప్రదోష వ్రతం రోజున ప్రత్యేక పూజలు, పరిహారాలు చేయడం వల్ల శని దేవుడి ఉగ్రరూపం శాంతించి, శుభ ఫలితాలు లభిస్తాయి.
1. శని ఆలయంలో ఆవనూనె దీపం
శని ప్రదోష వ్రతం రోజున సాయంత్రం వేళ శని దేవుడి ఆలయానికి వెళ్లాలి. అక్కడ నల్లని నువ్వులు వేసిన ఆవనూనెతో దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత శని దేవుడిని స్మరిస్తూ, "ఓం శ్యామ్ శనిశ్చరాయ నమః" అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు భక్తిశ్రద్ధలతో జపించాలి. ఇలా చేయడం వల్ల శని గ్రహ దోషాల తీవ్రత తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.
2. శని అనుగ్రహం కోసం ఈ వస్తువుల దానం
ఈ పవిత్రమైన రోజున శని దేవునికి ఇష్టమైన వస్తువులను దానం చేయడం వల్ల జాతకంలోని అశుభ ఫలితాలు తొలగిపోతాయి. శని ప్రదోషం నాడు నల్లని వస్త్రాలు, నల్ల నువ్వులు, మినుములు (నల్ల మినపప్పు) మరియు ఇనుముతో చేసిన వస్తువులను పేదలకు లేదా అర్హులైన వారికి దానం చేయాలి. దీనివల్ల శని దేవుడు సంతోషించి కోరిన కోర్కెలు నెరవేరుస్తాడని నమ్ముతారు.
3. రావి చెట్టు వద్ద ప్రదక్షిణలు
{{/usCountry}}ఈ పవిత్రమైన రోజున శని దేవునికి ఇష్టమైన వస్తువులను దానం చేయడం వల్ల జాతకంలోని అశుభ ఫలితాలు తొలగిపోతాయి. శని ప్రదోషం నాడు నల్లని వస్త్రాలు, నల్ల నువ్వులు, మినుములు (నల్ల మినపప్పు) మరియు ఇనుముతో చేసిన వస్తువులను పేదలకు లేదా అర్హులైన వారికి దానం చేయాలి. దీనివల్ల శని దేవుడు సంతోషించి కోరిన కోర్కెలు నెరవేరుస్తాడని నమ్ముతారు.
3. రావి చెట్టు వద్ద ప్రదక్షిణలు
{{/usCountry}}సడే సతి, ధైయా ప్రభావం ఎక్కువగా ఉన్నవారు శని ప్రదోషం రోజున రావి చెట్టు (అశ్వత్థ వృక్షం) వద్దకు వెళ్లి, ఆవ నూనెతో దీపం పెట్టాలి. రావి చెట్టులో త్రిమూర్తులతో పాటు శని దేవుడు కూడా నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. దీపం పెట్టిన తర్వాత రావి చెట్టు చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేయడం వల్ల పట్టిందల్లా బంగారమయం అవుతుందని…. అనుకున్న పనులు నిర్విఘ్నంగా సాగుతాయని భక్తుల విశ్వాసం.
4. హనుమాన్ చాలీసా పఠనం
శని దేవుడి ఉగ్రత నుంచి సులభంగా తప్పించుకోవాలంటే హనుమంతుడిని ఆరాధించడం ఏకైక మార్గం. శని ప్రదోషం రోజున ఆంజనేయ స్వామికి సింధూరం మరియు మల్లె నూనె (చమేలీ తైలం) సమర్పించి పూజించాలి. శని దేవుడి ప్రతికూల ప్రభావం పూర్తిగా తొలగిపోవడానికి ఈ రోజున కనీసం 108 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. హనుమద్ భక్తులను తాను ఎప్పటికీ ఇబ్బంది పెట్టనని శని దేవుడు స్వయంగా వరమిచ్చిన సంగతి తెలిసిందే.
5. శివలింగానికి జలాభిషేకం
శని దేవుడు పరమశివుడిని తన గురువుగా, ఆరాధ్య దైవంగా భావిస్తాడు. అందుకే శని ప్రదోష వ్రతం రోజున ఉదయాన్నే లేదా ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివలింగానికి భక్తితో జలాభిషేకం చేయాలి. శివ పూజ చేసే వారిపై శని దేవుడు ఎల్లప్పుడూ కరుణాకటాక్షాలను కురిపిస్తాడు. శివనామ స్మరణతో శని దోషాలన్నీ పటాపంచలవుతాయి.