...
...
Next Story

Shattila Ekadashi: ఈరోజు భోగి+షట్తిల ఏకాదశి.. ఈ ఏకాదశి ప్రాముఖ్యత, పూజా విధానం, దానాలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకోండి!

ఏటా పుష్య మాసంలో ఏకాదశిని షట్తిల ఏకాదశిగా జరుపుకుంటాము. ఈసారి భోగి నాడు షట్తిల ఏకాదశి రావడం విశేషం. షట్తిల ఏకాదశి రోజున అన్నం తినడం నిషేధించబడింది. భోగి పండుగ ఈ నెల 14వ తేదీన అంటే ఈరోజు వచ్చింది. సంక్రాంతి నాడు మధ్యాహ్నం జనవరి 15 వరకు ఏకాదశి తిధి ఉంటుంది. షట్తిల ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మంచిది.

Published on: Jan 14, 2026, 08:00:35 IST
Advertisement

ప్రతీ ఏటా పుష్య మాసంలో ఏకాదశిని షట్తిల ఏకాదశిగా జరుపుకుంటాము. ఈసారి భోగి నాడు షట్తిల ఏకాదశి రావడం విశేషం. షట్తిల ఏకాదశి రోజున అన్నం తినడం నిషేధించబడింది. భోగి పండుగ ఈ నెల 14వ తేదీన అంటే ఈరోజు వచ్చింది. సంక్రాంతి నాడు మధ్యాహ్నం జనవరి 15 వరకు ఏకాదశి తిధి ఉంటుంది. షట్తిల ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మంచిది. లేదా సాత్విక ఆహారాన్ని తీసుకోండి.

ఏకాదశి తిథి, షట్తిల ఏకాదశి 2026

Shattila Ekadashi: ఈరోజు భోగి+షట్తిల ఏకాదశి
Shattila Ekadashi: ఈరోజు భోగి+షట్తిల ఏకాదశి

ఏకాదశి తేదీ: జనవరి 14, 2026

ఏకాదశి తిథి ప్రారంభం: జనవరి 13, 2026, మధ్యాహ్నం 3:17

ఏకాదశి తిథి ముగింపు: జనవరి 14, 2026, సాయంత్రం 5:52

జనవరి 15, 2026, ఉదయం 7:15 నుంచి ఉదయం 9:21 లోగా ఉపవాసాన్ని విరమించవచ్చు

ద్వాదశి ముగింపు: జనవరి 15, 2026, సాయంత్రం 8:16

షట్తిల ఏకాదశి ప్రత్యేకత

  • షట్తిల ఏకాదశిలో నువ్వుల ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఈ రోజున నువ్వులు దానం చేసి ఉపవాసం చేసే వ్యక్తి యొక్క దుఃఖాలన్నీ భగవంతుడి కృపతో తొలగి పోతాయని చెబుతారు.
  • ఈ ఉపవాసం పాటించడం ద్వారా దుఃఖం, పేదరికం, ప్రతికూలత తొలగిపోతాయని విశ్వసిస్తారు.
  • ఆధ్యాత్మికంగా ఈ రోజు మనస్సు, మాట, చర్యల శుద్ధికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

షట్తిల ఏకాదశి రోజున ఏం దానం చేయాలి?

ఈ రోజున నువ్వులతో తయారైన వస్తువులను దానం చేయాలి. ఇది కాకుండా నల్ల నువ్వులు, బెల్లం, బట్టలు, నెయ్యి, ఉప్పు, చెప్పులు, దుప్పట్లు మొదలైన వాటిని దానం చేయడం అన్ని గ్రహాలను ప్రశాంతంగా ఉంచుతుందని నమ్మకం.

పూజా విధానం:

తులసి ఆకులు, పువ్వులు, పండ్లు మరియు పంచామృతంతో విష్ణుమూర్తిని అభిషేకం చేయండి.

విష్ణు సహస్రనామా లేదా భగవద్గీతను పఠించండి.

రోజంతా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉంటే మానసిక శాంతి, సానుకూల శక్తి, ఆధ్యాత్మిక వృద్ధిని తెస్తుంది. భక్తులు విష్ణుమూర్తి ఆశీస్సులు పొందడానికి, వారి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవడానికి ఈ రోజు ఒక అమూల్యమైన అవకాశం.

ఏకాదశి ఉపవాసం ఎలా పాటించాలి?

1. సూర్యోదయానికి ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.

2. విష్ణుమూర్తి విగ్రహానికి గంగా జలం సమార్పుంచండి. పువ్వులు, తులసి ఆకులు, పసుపు వస్త్రాలు, స్వీట్లు సమర్పించండి.

3. వ్రత కథ వినండి. ఈ రోజున, వ్రత కథ వింటే ప్రత్యేక ఫలితం ఉంటుంది.

4. ఆహారం - ఉపవాసం ఉన్న వ్యక్తి ఏకాదశి రోజున ఆహారం తీసుకోకూడదు. పండ్లు మాత్రమే తినండి లేదా నీరు త్రాగాలి.

5. ఉపవాసం సమయంలో సత్యం, అహింస మరియు సంయమనం పాటించాలి. ఉపవాసం పాటించేవారు ఈ రోజున ఎలాంటి చెడు ఆలోచనలు లేదా చర్యలకు దూరంగా ఉండాలి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe