జ్యోతిష్య శాస్త్రంలో విలాసాలు, సౌఖ్యం, ప్రేమ మరియు సంపదలకు కారకుడిగా భావించే శుక్ర గ్రహం యొక్క కదలికల్లో త్వరలోనే భారీ మార్పు రాబోతోంది. ప్రస్తుతం తులారాశిలో రుజుమార్గంలో (నేరుగా) సంచరిస్తున్న శుక్రుడు కొద్ది రోజుల్లో తన దిశను మార్చుకుని రివర్స్ మోషన్ అంటే వక్రమార్గంలోకి ప్రవేశించనున్నాడు. నవగ్రహాల్లో శుక్రుడి సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహం యొక్క వక్ర సంచారం కొన్ని రాశుల వారి అదృష్టాన్ని ఒక్కసారిగా తిప్పివేస్తుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

హిందూ పంచాంగం ప్రకారం….. రాబోయే అక్టోబర్ 3, 2026 మధ్యాహ్నం 12:45 గంటలకు శుక్ర గ్రహం తన తిరోగమన (వక్ర) గమనాన్ని ప్రారంభిస్తుంది. ఈ వక్ర సంచారం మొత్తం 41 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈ సమయంలో మేష రాశి నుంచి మీన రాశి వరకు మొత్తం 12 రాశులపైనా దీని ప్రభావం కనిపిస్తుంది. అయితే, ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ 41 రోజుల కాలంలో ప్రత్యేకంగా 5 రాశుల వారికి ఊహించని ధనలాభం, అకస్మాత్తుగా కలిసివచ్చే అదృష్టం దక్కనున్నాయి.
మేష రాశి:
శుక్రుడి వక్ర గమనం మేష రాశి జాతకులకు ఎంతో మేలు చేస్తుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో ఉన్నవారికి ఆకస్మిక ధనలాభాలు కలగవచ్చు. ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపించే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి శుక్రుడి రివర్స్ మూవ్‌మెంట్ శుభ ఫలితాలను ఇస్తుంది. మీ జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు వేగవంతం కావడమే కాకుండా మనశ్శాంతి లభిస్తుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారాలు ఎంతో సంతోషకరంగా సాగుతాయి. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది.
కర్కాటక రాశి:
{{/usCountry}}ధనుస్సు రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారాలు ఎంతో సంతోషకరంగా సాగుతాయి. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది.
కర్కాటక రాశి:
{{/usCountry}}కర్కాటక రాశి జాతకులకు శుక్రుడి సంచారం అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి పెట్టుబడిదారులు లభించే అవకాశం ఉంది. కష్ట సమయాల్లో కుటుంబ సభ్యులు, ప్రాణస్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
మీన రాశి:
మీన రాశి వారికి ఈ తిరోగమన సంచారం సానుకూల మార్పులను తెస్తుంది. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వికసిస్తాయి. కుటుంబ సంబంధాలు మరింత బలోపేతమవుతాయి.