అక్టోబర్ 3 నుంచి శుక్రుడి వక్రగమనం - ఈ 5 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం!

అక్టోబర్ 3న శుక్రుడు వక్రగమనం ప్రారంభించనున్నాడు. 42 రోజుల పాటు సాగే ఈ తిరోగమన సంచారంతో మేషం, వృశ్చికంతో సహా 5 రాశుల వారి జాతకం మారిపోనుంది.

Published on: Sep 29, 2026, 08:00:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో విలాసాలు, సౌఖ్యం, ప్రేమ మరియు సంపదలకు కారకుడిగా భావించే శుక్ర గ్రహం యొక్క కదలికల్లో త్వరలోనే భారీ మార్పు రాబోతోంది. ప్రస్తుతం తులారాశిలో రుజుమార్గంలో (నేరుగా) సంచరిస్తున్న శుక్రుడు కొద్ది రోజుల్లో తన దిశను మార్చుకుని రివర్స్ మోషన్ అంటే వక్రమార్గంలోకి ప్రవేశించనున్నాడు. నవగ్రహాల్లో శుక్రుడి సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహం యొక్క వక్ర సంచారం కొన్ని రాశుల వారి అదృష్టాన్ని ఒక్కసారిగా తిప్పివేస్తుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

అక్టోబర్ 3 నుంచి శుక్రుడి వక్ర సంచారం
అక్టోబర్ 3 నుంచి శుక్రుడి వక్ర సంచారం

హిందూ పంచాంగం ప్రకారం….. రాబోయే అక్టోబర్ 3, 2026 మధ్యాహ్నం 12:45 గంటలకు శుక్ర గ్రహం తన తిరోగమన (వక్ర) గమనాన్ని ప్రారంభిస్తుంది. ఈ వక్ర సంచారం మొత్తం 41 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈ సమయంలో మేష రాశి నుంచి మీన రాశి వరకు మొత్తం 12 రాశులపైనా దీని ప్రభావం కనిపిస్తుంది. అయితే, ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ 41 రోజుల కాలంలో ప్రత్యేకంగా 5 రాశుల వారికి ఊహించని ధనలాభం, అకస్మాత్తుగా కలిసివచ్చే అదృష్టం దక్కనున్నాయి.

మేష రాశి:

శుక్రుడి వక్ర గమనం మేష రాశి జాతకులకు ఎంతో మేలు చేస్తుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో ఉన్నవారికి ఆకస్మిక ధనలాభాలు కలగవచ్చు. ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపించే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి శుక్రుడి రివర్స్ మూవ్‌మెంట్ శుభ ఫలితాలను ఇస్తుంది. మీ జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు వేగవంతం కావడమే కాకుండా మనశ్శాంతి లభిస్తుంది.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారాలు ఎంతో సంతోషకరంగా సాగుతాయి. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి జాతకులకు శుక్రుడి సంచారం అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి పెట్టుబడిదారులు లభించే అవకాశం ఉంది. కష్ట సమయాల్లో కుటుంబ సభ్యులు, ప్రాణస్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.

మీన రాశి:

మీన రాశి వారికి ఈ తిరోగమన సంచారం సానుకూల మార్పులను తెస్తుంది. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వికసిస్తాయి. కుటుంబ సంబంధాలు మరింత బలోపేతమవుతాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More