గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. అలాంటప్పుడు శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను చూస్తూ ఉంటాం. ఒక్కోసారి కొన్ని రాశుల వారికి మంచి జరిగితే, ఒక్కోసారి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

నవంబర్ నెల కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఈ రాశుల వారు శుక్ర రాజయోగంతో అనేక విధాలుగా ప్రయోజనాలను పొందబోతున్నారు. మరి, నవంబర్ నెలలో శుక్రాదిత్య రాజయోగంతో ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
అక్టోబర్ 17న సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడుతులా రాశిలో సంచారం చేస్తున్నాడు. దాంతో శుక్రుడితో కలిపి రాజయోగాన్ని ఏర్పరిచాడు. ఈ సంచారం నవంబర్ 6 వరకు ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందబోతున్నారు.
అక్టోబర్ 17 నుంచి నవంబర్ 6 వరకు ఈ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో కష్టపడినా ఫలితం రాకపోయినట్లయితే, నవంబర్ 6లోగా మీరు శుభవార్తలను, తగిన ఫలితాలను చూడొచ్చు.
మేష రాశి
మేష రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. సానుకూల మార్పులను చూస్తారు. కెరీర్లో కూడా అద్భుతమైన మలుపులు ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. ఈ కారణంగా పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు.
భారీగా ఇన్వెస్ట్మెంట్ల నుంచి లాభాలను పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత జీవితంలో కూడా మార్పులు ఉంటాయి. రిలేషన్షిప్ మరింత మధురంగా మారుతుంది.
తులా రాశి
తులా రాశి వారు నవంబర్ 6లోపు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అవకాశాలను కూడా ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. సమస్యలన్నీ కూడా ఇట్టే పరిష్కారం అవుతాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారి అదృష్టం డబుల్ అవుతుంది. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. కొత్త ప్లాన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. కెరీర్లో కూడా ఓ మెట్టు పైకి వెళ్తారు. ఉద్యోగం మారాలని అనుకుంటున్నట్లయితే, ఇది సరైన సమయం. మంచి అవకాశాలు వస్తాయి. సరిగ్గా ప్రణాళికతో పనులు చేస్తే అవకాశాలు పెరుగుతాయి. అనుకున్న వాటిని విజయవంతంగా పూర్తి చేయొచ్చు.
{{/usCountry}}ధనుస్సు రాశి వారికి అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారి అదృష్టం డబుల్ అవుతుంది. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. కొత్త ప్లాన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. కెరీర్లో కూడా ఓ మెట్టు పైకి వెళ్తారు. ఉద్యోగం మారాలని అనుకుంటున్నట్లయితే, ఇది సరైన సమయం. మంచి అవకాశాలు వస్తాయి. సరిగ్గా ప్రణాళికతో పనులు చేస్తే అవకాశాలు పెరుగుతాయి. అనుకున్న వాటిని విజయవంతంగా పూర్తి చేయొచ్చు.
{{/usCountry}}