శుక్రాదిత్య రాజయోగంతో మూడు రాశులకు నవంబర్ 6 లోపే జాక్‌పాట్.. కెరీర్‌లో ఊహించని మార్పులు!

జ్యోతిష్య నమ్మకాల ప్రకారం, సూర్యుడు, శుక్రుడు తులా రాశిలో సంచరించడం వల్ల శుక్రాదిత్య యోగం ఏర్పడిందని ఈ కథనం పేర్కొంటోంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 6 వరకు ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. 

Published on: Oct 23, 2026, 12:30:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. అలాంటప్పుడు శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను చూస్తూ ఉంటాం. ఒక్కోసారి కొన్ని రాశుల వారికి మంచి జరిగితే, ఒక్కోసారి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

శుక్రాదిత్య రాజయోగంతో మూడు రాశులకు నవంబర్ 6 లోపే జాక్‌పాట్.. కెరీర్‌లో ఊహించని మార్పులు! (AI)
శుక్రాదిత్య రాజయోగంతో మూడు రాశులకు నవంబర్ 6 లోపే జాక్‌పాట్.. కెరీర్‌లో ఊహించని మార్పులు! (AI)

నవంబర్ నెల కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఈ రాశుల వారు శుక్ర రాజయోగంతో అనేక విధాలుగా ప్రయోజనాలను పొందబోతున్నారు. మరి, నవంబర్ నెలలో శుక్రాదిత్య రాజయోగంతో ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

అక్టోబర్ 17న సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడుతులా రాశిలో సంచారం చేస్తున్నాడు. దాంతో శుక్రుడితో కలిపి రాజయోగాన్ని ఏర్పరిచాడు. ఈ సంచారం నవంబర్ 6 వరకు ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందబోతున్నారు.

అక్టోబర్ 17 నుంచి నవంబర్ 6 వరకు ఈ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో కష్టపడినా ఫలితం రాకపోయినట్లయితే, నవంబర్ 6లోగా మీరు శుభవార్తలను, తగిన ఫలితాలను చూడొచ్చు.

మేష రాశి

మేష రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. సానుకూల మార్పులను చూస్తారు. కెరీర్‌లో కూడా అద్భుతమైన మలుపులు ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. ఈ కారణంగా పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు.

భారీగా ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి లాభాలను పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత జీవితంలో కూడా మార్పులు ఉంటాయి. రిలేషన్‌షిప్ మరింత మధురంగా మారుతుంది.

తులా రాశి

తులా రాశి వారు నవంబర్ 6లోపు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. అవకాశాలను కూడా ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. సమస్యలన్నీ కూడా ఇట్టే పరిష్కారం అవుతాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారి అదృష్టం డబుల్ అవుతుంది. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. కొత్త ప్లాన్‌లను విజయవంతంగా పూర్తి చేస్తారు. కెరీర్‌లో కూడా ఓ మెట్టు పైకి వెళ్తారు. ఉద్యోగం మారాలని అనుకుంటున్నట్లయితే, ఇది సరైన సమయం. మంచి అవకాశాలు వస్తాయి. సరిగ్గా ప్రణాళికతో పనులు చేస్తే అవకాశాలు పెరుగుతాయి. అనుకున్న వాటిని విజయవంతంగా పూర్తి చేయొచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More