...
...
Next Story

నిద్ర, ఏకాగ్రత, సానుకూల శక్తి కోసం ఈ 5 ఎసెన్షియల్ ఆయిల్స్ ఉపయోగించండి!

మీ ఇంట్లో ప్రశాంతత, సానుకూల శక్తి, ఉత్సాహభరితమైన వాతావరణం కావాలా? ఫెంగ్ షుయీ ప్రకారం లావెండర్, లెమన్, పెప్పర్‌మింట్, యూకలిప్టస్, దాల్చినచెక్క ఎసెన్షియల్ ఆయిల్స్‌ను సరైన గదుల్లో ఉపయోగించడం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, తాజాదనం, ఆహ్లాదకరమైన వాతావరణం పెరుగుతుందని విశ్వసిస్తారు.

Published on: Jul 18, 2026, 14:00:35 IST
Advertisement

మీ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత, ఉల్లాసమైన వాతావరణం ఉండాలని కోరుకుంటున్నారా? ఫెంగ్ షుయీ నిపుణుల సూచనల మేరకు ఎసెన్షియల్ ఆయిల్స్‌తో మీ ఇంటిని సానుకూల శక్తితో నింపవచ్చు. ప్రతి ఆయిల్‌కు ఒక ప్రత్యేకత ఉందని, సరైన గదిలో సరైన సువాసనను ఉపయోగించడం ద్వారా అద్భుతమైన మార్పులను చూడవచ్చని చెబుతున్నారు.

ఇంటికి సానుకూల శక్తినిచ్చే 5 అద్భుతమైన ఎసెన్షియల్ ఆయిల్స్

నిద్ర, ఏకాగ్రత, సానుకూల శక్తి కోసం ఈ 5 ఎసెన్షియల్ ఆయిల్స్ ఉపయోగించండి!
నిద్ర, ఏకాగ్రత, సానుకూల శక్తి కోసం ఈ 5 ఎసెన్షియల్ ఆయిల్స్ ఉపయోగించండి!

ప్రతి గదిలోనూ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. దానికి తగినట్లుగా సువాసనలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఫెంగ్ షుయీ ప్రకారం అత్యంత ప్రభావవంతమైన ఐదు ఆయిల్స్ ఇవే:

1. నిద్రలేమితో సతమతమవుతున్నారా? - లావెండర్

ప్రశాంతమైన నిద్ర కోసం లావెండర్ ఆయిల్ మించింది లేదు. రోజంతా పడిన శ్రమ వల్ల కలిగే ఒత్తిడిని, ఆందోళనను ఇది దూరం చేస్తుంది. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో డిఫ్యూజర్ ద్వారా దీని సువాసనను వెదజల్లితే, మనసు తేలికపడటమే కాకుండా భాగస్వాముల మధ్య అనుబంధం కూడా బలపడుతుందని నమ్మకం.

2. ఉత్సాహం కోసం - లెమన్

వంటగది, లివింగ్ రూమ్ కుటుంబ సభ్యులు ఎక్కువగా గడిపే ప్రదేశాలు. నిమ్మ (లెమన్) సువాసన తాజాదనాన్ని ఇవ్వడమే కాకుండా, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఒకవేళ మీకు లెమన్ నచ్చకపోతే, అదే స్థాయిలో ఉత్సాహాన్ని ఇచ్చే ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్‌ను కూడా ఎంచుకోవచ్చు.

3. ఏకాగ్రత పెరగాలంటే - పెప్పర్‌మింట్

పిల్లల స్టడీ రూమ్‌లో లేదా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న గదిలో పెప్పర్‌మింట్ ఆయిల్ వాడటం చాలా మంచిది. ఇది మెదడును చురుగ్గా ఉంచి, పని మీద లేదా చదువు మీద పూర్తి దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. ఆఫీసులో ఉన్నప్పుడు హ్యాండ్‌కర్చీఫ్‌పై ఒక చుక్క పెప్పర్‌మింట్ ఆయిల్ రాసుకుంటే తక్షణమే మెదడు రీఫ్రెష్ అవుతుంది.

4. స్నానాల గదిలో స్వచ్ఛత కోసం - యూకలిప్టస్

ఇంటికి ప్రవేశ మార్గం చాలా కీలకమైనది. మెయిన్ డోర్ దగ్గర దాల్చినచెక్క నూనెను ఉపయోగిస్తే, బయటి నుంచి వచ్చే చెడు శక్తులను ఇది అడ్డుకుంటుందని, ఇంట్లోకి ఐశ్వర్యం ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు.

సువాసనలను ఎలా ఉపయోగించాలి?

ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ వాడటం చాలా సులభం.

అరోమా డిఫ్యూజర్: ఒక డిఫ్యూజర్‌లో కొద్దిగా నీరు పోసి, 4 నుంచి 5 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపండి.

మేన్యువల్ డిఫ్యూజర్: రాతితో చేసిన చిన్న డిఫ్యూజర్లలో చిన్న కొవ్వొత్తిని ఉపయోగించి కూడా ఈ సువాసనను గది అంతా వ్యాపింపజేయవచ్చు.

సరైన సువాసనలు మీ ఇంటిని కేవలం సుగంధభరితంగా మార్చడమే కాకుండా, మీ కుటుంబ సభ్యుల మానసిక స్థితిని మెరుగుపరచి, సంతోషాన్ని కలిగిస్తాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks