ఇంట్లో డబ్బు నిలవట్లేదా? ఈ 5 వస్తువులు కారణం కావచ్చని వాస్తు సూచన
చేతిలో డబ్బు నిలవకపోవడం వంటి సమస్యలకు కొన్ని వాస్తు దోషాలు కారణమని నమ్ముతారు. వాస్తు ప్రకారం పాత సామాన్లు, పనిచేయని గడియారాలు, పగిలిన అద్దాలు, కారుతున్న కుళాయిలు, ముళ్ల మొక్కలు వంటి వస్తువులను తొలగించడం వల్ల సానుకూల శక్తి పెరిగి, ఆర్థిక పురోగతికి మార్గం సుగమమవుతుందని చెబుతారు.
చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ చేతిలో డబ్బు నిలవదు. కష్టపడి సంపాదించిన డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతుంది. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? వాస్తు ప్రకారం, మీరు ఉంటున్న ఇంట్లో నుంచి కొన్ని వస్తువులను తొలగించండి. లేకపోతే ఆర్థిక ప్రగతికి అవి అడ్డుపడతాయి. ఆ వస్తువులను తొలగించినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, ఆనందంగా ఉండవచ్చని, సంపదకు లోటు ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో అప్పులు తీరట్లేదా? అయితే ఈ వస్తువులే దరిద్రానికి కారణం
1.పాత సామాన్లు, పాడైపోయిన వస్తువులు
చాలా మంది ఇళ్లల్లో పాత సామాన్లు, పాడైపోయిన వస్తువులు ఉంచుతూ ఉంటారు. వాస్తు ప్రకారం, ఇలాంటి వస్తువుల వల్ల ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. ఆర్థిక అభివృద్ధి ఆగిపోతుంది. మీ ఇంటిని ఆర్థికంగా ఆరోగ్యవంతంగా ఉంచాలంటే ఈ వస్తువులను తప్పకుండా ఇంటి నుంచి తొలగించాలి.
2.పని చేయని గడియారాలు
గడియారాలు సమయానికి, ప్రగతికి సంకేతం. ఇంట్లో గడియారం పనిచేయకపోతే, అది కెరీర్, ఆర్థిక ఎదుగుదలను ఆపేస్తోందని వాస్తు నమ్మకం. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే దురదృష్టం కూడా పెరుగుతుంది. ఒకవేళ గడియారం పాడైపోతే దానిని వెంటనే బాగు చేయించడం మంచిది.
3.పగిలిన అద్దాలు, గాజు సామాన్లు
వాస్తు ప్రకారం, పగిలిన అద్దాలు, గాజు సామాన్లు లేదా విరిగిపోయిన వస్తువులను వెంటనే తొలగించాలి. ఇలాంటి వస్తువులు మానసిక ఒత్తిడిని పెంచుతాయని చెబుతారు. కాబట్టి ఈ వస్తువులను ఇంటి నుంచి తొలగించాలి. లేకపోతే సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.
4.కారుతున్న కుళాయిలు
వంటగదిలో లేదా బాత్రూంలో కుళాయి నుంచి నీరు కారుతుంటే అది మంచిది కాదు. నీరు వృథాగా పోవడం అంటే సంపద వృథా కావడమేనని వాస్తు నమ్మకం. ఇది అనవసరమైన ఆర్థిక భారం, ఖర్చులకు దారితీస్తుంది. అందుకే లీకేజీలను వెంటనే రిపేర్ చేయించాలి.
5.ముళ్ల మొక్కలు, భయంకరమైన చిత్రాలు
అలంకరణ కోసం చాలామంది ఇళ్లల్లో మొక్కలు పెడుతూ ఉంటారు. అయితే ముళ్ల మొక్కలను కూడా పెడుతుంటారు. క్యాక్టస్ వంటి ముళ్ల మొక్కలను ఇంట్లో పెట్టకండి. అలాగే సముద్రంలో మునిగిపోతున్న పడవల చిత్రాలు కూడా పెట్టకూడదు. మహాభారత యుద్ధ సన్నివేశాలు, క్రూర మృగాల బొమ్మలు, తాజ్ మహల్ వంటి చిత్రాలను ఇంట్లో పెడితే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాస్తు నమ్మకం. ఆర్థిక సమస్యలు కూడా పెరుగుతాయి.
ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఇంటి నుంచి తొలగించడం మంచిది. ఎప్పుడూ ఇల్లు ప్రశాంతమైన చిత్రాలతో అలంకరించి ఉండాలి. అలాగే దుఃఖాన్ని ప్రతిబింబించే, హింసను ప్రేరేపించే ఫోటోలను కూడా పెట్టకూడదు. ఇవి కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


