Vastu: ఇంట్లో వైజయంతి మొక్క ఉంటే కష్టాలు దూరం.. వాస్తు ప్రకారం ఎక్కడ నాటాలో తెలుసా?
వైజయంతి మొక్క వాస్తు ప్రయోజనాలు: ఇంట్లో వైజయంతి మొక్కను నాటడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, దానిని అప్లై చేసే సరైన దిశ మరియు పద్ధతిని తెలుసుకోవడం చాలా ముఖ్యం, అప్పుడే అది ప్రయోజనకరంగా ఉంటుంది. దాని గురించి తెలుసుకోండి.
వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలకు విశేష ప్రాముఖ్యత ఉంది. వీటిని ఇంట్లో పెంచడం వల్ల సానుకూల శక్తి పెరగడమే కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లివిరుస్తుంది. అలాంటి అదృష్టాన్ని తెచ్చే మొక్కల్లో 'వైజయంతి' ఒకటి.

ఇంట్లో వైజయంతి మొక్క: ఎందుకు అంత ప్రత్యేకం?
ఆధ్యాత్మికంగా వైజయంతి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణ పరమాత్ముడు, విష్ణుమూర్తికి ఈ మొక్క అంటే ఎంతో ఇష్టం. వైజయంతి మాలను ధరించడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పవిత్రమైన మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆ భగవంతుని ఆశీస్సులు నిరంతరం ఉంటాయని నమ్మకం. ఇది ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా, మన ఆలోచనల్లో కూడా సానుకూల మార్పులను తీసుకువస్తుంది.
ఎక్కడ నాటితే శుభం?
మొక్కను నాటే దిశ వాస్తులో అత్యంత కీలకం. వైజయంతి మొక్కను ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో నాటడం చాలా మంచిది. ప్రత్యేకించి ఉత్తర లేదా తూర్పు దిశలో ఈ మొక్కను ఉంచడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. ఈ రెండు దిశలు సానుకూల శక్తికి నిలయాలు. ఇక్కడ మొక్కను నాటడం ద్వారా ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ రెట్టింపు అవుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు
వైజయంతి మొక్కను పెంచేటప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి:
చీకటి ప్రదేశాలు వద్దు: ఈ మొక్కకు తగినంత వెలుతురు అవసరం. కాబట్టి చీకటిగా ఉండే మూలల్లో వీటిని ఉంచకండి.
పరిశుభ్రత ముఖ్యం: మొక్కకు సమీపంలో చెప్పులు, చెత్త బుట్టలు వంటివి ఉండకూడదు. మొక్క చుట్టూ ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి.
తేమ సమస్య: గోడలకు తేమ ఉన్న చోట ఈ మొక్కను పెట్టకండి. దీనివల్ల మొక్క ఎదుగుదల దెబ్బతింటుంది.
ఎలా సంరక్షించుకోవాలి?
వైజయంతి మొక్కను పెంచడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. తక్కువ నీటితోనే ఇది బాగా పెరుగుతుంది. కుండీలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి, అధిక నీరు పోస్తే వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు ఎండిపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను తొలగించడం ద్వారా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే, గాలి, వెలుతురు సరిగ్గా తగిలేలా ఇతర మొక్కలకు తగినంత దూరం ఉంచండి.
నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


