శనివారం నల్ల నువ్వులతో ఈ చిన్న పరిహారం పాటిస్తే.. అదృష్టాన్ని మార్చేయడంతో పాటు అనేక లాభాలు !

శనివారం స్నానపు నీటిలో నల్ల నువ్వులను వేయడం శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ సులభమైన నివారణతో శని దోషం, సదేశతి మరియు వ్యతిరేక శక్తితో సంబంధం ఉన్న 3 ప్రధాన ప్రయోజనాలను తెలుసుకోండి.

Published on: Jun 27, 2026, 11:00:35 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శని దేవుని అనుగ్రహం పొందడానికి శనివారం చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితంలోని కష్టాలను దూరం చేయడమే కాకుండా, కెరీర్ మరియు ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తుంది. నల్ల నువ్వుల స్నానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఇక్కడ తెలుసుకోండి.

శనివారం నల్ల నువ్వులుతో ఈ చిన్న పరిహారం పాటిస్తే.. అదృష్టాన్ని మార్చేయడంతో పాటు అనేక లాభాలు !
శనివారం నల్ల నువ్వులుతో ఈ చిన్న పరిహారం పాటిస్తే.. అదృష్టాన్ని మార్చేయడంతో పాటు అనేక లాభాలు !

శనివారం అంటేనే శని దేవునికి ఎంతో ప్రీతికరమైన రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని గ్రహ ప్రభావం జీవితంపై సానుకూలంగా ఉండాలంటే కొన్ని చిన్నపాటి పరిహారాలు పాటించడం ఉత్తమం. అందులోనూ అత్యంత ప్రభావవంతమైనది ‘నల్ల నువ్వుల స్నానం’. మన పెద్దలు, జ్యోతిష్య నిపుణులు చెబుతున్న ఈ పద్ధతిని పాటిస్తే, శని దోషాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

శని దోషాలు, ఏలినాటి శని ప్రభావం తగ్గుముఖం

నల్ల నువ్వులను శని దేవునికి అత్యంత ఇష్టమైన పదార్థాలుగా పరిగణిస్తారు. జాతకంలో శని గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు లేదా శని మహాదశ, ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి కష్టకాలంలో ఉన్నవారు ప్రతి శనివారం స్నానపు నీటిలో కొద్దిగా నల్ల నువ్వులు వేసి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని దేవుని అనుగ్రహం కలిగి, జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక అవరోధాలు తగ్గుతాయని పండితులు చెబుతుంటారు.

ప్రతికూల శక్తిని తరిమికొట్టే మార్గం

వారమంతా చేసే పని ఒత్తిడి, మానసిక అలసట మనిషిని నీరసపడేలా చేస్తాయి. దీనివల్ల మన చుట్టూ ప్రతికూల శక్తి (Negative Energy) పెరిగి, చేసే పనుల్లో చిరాకు వచ్చే అవకాశం ఉంది. స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసి స్నానం చేయడం వల్ల శరీరంతో పాటు మనస్సు కూడా తేలికపడుతుంది. ఇది దృష్టి దోషాలను తొలగించి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.

ఆగిపోయిన పనులు సానుకూలం

ఎంత కష్టపడినా చివరి నిమిషంలో పనులు ఆగిపోతున్నాయా? అయితే ఇది మీ జాతకంలోని దోషం కావచ్చు. నల్ల నువ్వులతో స్నానం చేయడం వల్ల అదృష్టం కలిసి వచ్చి, కెరీర్ మరియు వ్యాపార రంగాల్లో ఆటంకాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఇది మీ ఆర్థిక వనరులను మెరుగుపరచడమే కాకుండా, ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి కూడా సహాయపడుతుందని శాస్త్రం చెబుతోంది.

ఈ పరిహారం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ పరిహారం చాలా సులభమే కానీ, దీనిని చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. లేదంటే ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండవు.

శనివారం ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నల్ల నువ్వులను కలపండి.

ముఖ్యమైన విషయం: స్నానం చేసిన తర్వాత బకెట్ లేదా టబ్‌లో మిగిలిపోయిన నువ్వులను మురుగు కాలువల్లో పారబోయకండి.

ఆ నువ్వులను తీసి మొక్కల మొదళ్ళలో వేయడం లేదా మట్టిలో వేయడం చేయండి.

పొరపాటున కూడా ఆ నువ్వులు మీ కాళ్ళ కింద పడకుండా చూసుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More