Shani Trayodashi: శని త్రయోదశి మహత్యం.. నేడు ఈ 5 రాశుల వారికి ప్రత్యేక శుభ ఫలితాలు!

శని త్రయోదశి ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ప్రస్తుతం మేష, సింహ, ధనుస్సు, కుంభ, మీన రాశులపై శని ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఈ రోజు వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ రాశుల వారు కెరీర్, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం వంటి విషయాల్లో సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తారు.

Published on: Jun 27, 2026, 08:00:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. సమస్యల నుంచి బయటపడడానికి రకరకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పదేపదే సమస్యలు ఎదురవుతున్నట్లయితే చాలామంది శని ప్రభావం గురించి ఆలోచిస్తారు. శని మనం చేసే పనులను బట్టి ఫలితాలు ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలు, చెడు పనులకు చెడు ఫలితాలు ఎదురవుతాయి. అలాగే ఏలినాటి శని ప్రభావం వల్ల కూడా చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటారు.

Shani Trayodashi: శని త్రయోదశి మహత్యం.. నేడు ఈ 5 రాశుల వారికి ప్రత్యేక శుభ ఫలితాలు!
Shani Trayodashi: శని త్రయోదశి మహత్యం.. నేడు ఈ 5 రాశుల వారికి ప్రత్యేక శుభ ఫలితాలు!

జ్యోతిష్యం ప్రకారం జూన్ 27 చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు శని త్రయోదశి రావడం వల్ల శని ప్రభావంలో ఉన్న ఐదు రాశుల వారికి విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు శని త్రయోదశి వేళ ఏ రాశుల వారికి శుభాలు కలుగబోతున్నాయి? ఎవరికి ఎక్కువగా ప్రయోజనాలు కలుగుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా ప్రత్యేకమైన శని త్రయోదశి

జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష త్రయోదశి శనివారం రోజు రావడంతో శని త్రయోదశిని జరుపుకుంటాము. శని త్రయోదశి నాడు శని దేవునిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఎన్నో శుభ ఫలితాలను పొందడానికి వీలవుతుందని చెబుతారు. ప్రస్తుతం మూడు రాశుల వారికి ఏలినాటి శని, మరో రెండు రాశులకు అర్ధాష్టమ శని నడుస్తోంది. అందువల్ల ఈ ఐదు రాశుల వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

1.మేష రాశి

మేష రాశి వారు శని ప్రభావం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే ఈ శని త్రయోదశిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈ కింది పరిహారాలను పాటిస్తే మీకు మంచి ఫలితాలు ఎదురవుతాయి. కెరీర్, వ్యాపారంలో ఎక్కువ శ్రమ పడాల్సి వస్తున్నా, ఫలితాలు ఆలస్యంగా వస్తున్నా, అపార్థాలు ఎదురవుతున్నా ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ఈరోజు మీకు శుభ ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శని పరిహారాలను పాటించండి.

2.సింహ రాశి

సింహ రాశి వారు శని ప్రభావంలో ఉన్నారు. కాబట్టి మానసిక ఒత్తిడి, ఆత్మవిశ్వాసం తగ్గడం లాంటివి ఎదురవుతాయి. అలాంటప్పుడు శని దేవుడికి సంబంధించిన పరిహారాలను పాటించడం మంచిది. ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఇది అద్భుతమైన అవకాశం. ఈ రాశి వారు క్రమశిక్షణతో ఉండడం, అవసరమైన వారికి సాయం చేయడం వంటివి శుభ ఫలితాలను ఇస్తాయి.

3.ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి శని ప్రభావం వల్ల అనుకోని ఖర్చులు పెరుగుతాయి. పనుల్లో ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఆందోళన, అస్థిరత కూడా ఉండొచ్చు. ఈ సమయంలో ఓర్పుతో ఉండాలి. దైవభక్తి కూడా ముఖ్యం.

4.కుంభ రాశి

కుంభ రాశి వారికి శని ప్రభావం వల్ల ఎంత కష్టపడినా పనులు ఆలస్యంగా పూర్తవడం, నిర్ణయాల్లో అయోమయం, జీవితంలో ఒడిదుడుకులు వంటివి ఉండొచ్చు. అలాంటప్పుడు క్రమశిక్షణతో ఉండాలి. సహాయం చేసే అలవాటును పెంచుకోవాలి. అలాగే ఈ శని త్రయోదశి నాడు కింద ఉన్న పరిహారాలను పాటిస్తే మంచిది.

5.మీన రాశి

మీన రాశి వారికి కూడా శని ప్రభావం ఉంది. ఆర్థిక విషయాల్లో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందుకోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు వంటివి చేస్తే మంచిది.

శని దోష నివారణకు ఈ పరిహారాలను పాటించండి

  • శని త్రయోదశి సాయంత్రం శని దేవుని ఆలయానికి వెళ్లి ఆవాల నూనెను సమర్పించండి.
  • నూనె సమర్పించేటప్పుడు శని దేవుడి కళ్లల్లో కాకుండా పాదాల వైపు చూడాలి.
  • "ఓం శనైశ్చరాయ నమః" మంత్రాన్ని జపిస్తూ ఏడు లేదా 11 ప్రదక్షిణలు చేయండి.
  • రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపాన్ని వెలిగిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.
  • హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కూడా శని అనుగ్రహాన్ని పొందవచ్చు.
  • నల్ల నువ్వులు, నల్ల మినుములు, ఇనుప పాత్రలు, నల్ల బట్టలు వంటివి దానం చేస్తే కూడా ఈ రాశుల వారికి బాగా కలిసొస్తుంది.
  • తీవ్రమైన శని దోషంతో బాధపడుతున్నట్లయితే శివలింగానికి నీళ్లు, నల్ల నువ్వులను సమర్పించి మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More