...
...
Next Story

Sleeping : ఏ విధంగా నిద్రించడం సరైన పద్ధతి? తల ఎటువైపునకు పెట్టి పడుకోవాలి?

Sleeping : కొత్తగా ఎక్కడికైనా వెళ్లినప్పుడు తల ఎటువైపు పెట్టి పడుకోవాలనే గందరగోళం ఉంటుంది. సరైన పద్ధతిలో పడుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

Published on: Apr 23, 2026 10:02 PM IST
Advertisement

ఒక వ్యక్తి ఆరోగ్యం వారి దినచర్యపై ఆధారపడి ఉంటుంది. ఈ దినచర్యలో నిద్ర ఒక ముఖ్యమైన భాగం. నిద్ర అంటే కేవలం కాసేపు కునుకు తీయడం మాత్రమే కాదు.. దానికి మన ఆరోగ్యంతో కూడా సంబంధం ఉంది. శాస్త్రాల ప్రకారం సరైన నిద్ర అలవాట్లను తెలుసుకోవాలి. ఏ వైపునకు తల పెట్టాలి, ఏ వైపునకు కాళ్లు పెట్టాలి అని కూడా తెలిసి ఉండాలి.

నిద్రపోవడానికి సరైన సమయం

నిద్ర చిట్కాలు
నిద్ర చిట్కాలు

శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం అయిన సుమారుగా మూడు గంటల తర్వాత నిద్రపోవాలి. సూర్యోదయం తర్వాత నిద్రపోవడం అనారోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. సాయంత్రంపూట నిద్రపోవడం కూడా అశుభంగా భావిస్తారు. నిద్రపోయేటప్పుడు మీ తల గోడ నుండి మూడు చేతుల దూరంలో ఉండేలా చూసుకోవాలి.

నిద్రపోవడానికి సరైన దిశ

నిద్రించే దిశపై ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలి. మీరు మీ తలను తూర్పు వైపునకు తిప్పి ఉంచుకోవచ్చు. ఎందుకంటే సూర్యోదయం ఈ దిశలోనే జరుగుతుంది. సో.. ఈ దిశలో తల తిప్పి నిద్రించడం వల్ల జ్ఞానం పెరుగుతుందని నమ్మకం. అలాగే తలను దక్షిణం వైపునకు తిప్పి కూడా నిద్రపోవచ్చు. అయితే పాదాలు దక్షిణం లేదా తూర్పు వైపునకు పెట్టి ఎప్పుడూ నిద్రపోకూడదు. ఎందుకంటే ఇది మనసులో ప్రతికూలతను పెంచుతుంది. మీకు మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి.

శాస్త్రాలు ఒక వ్యక్తికి ఎలాంటి పడక ఉండాలో కూడా వివరిస్తాయి. విరిగిన, మురికిగా ఉన్న, మరీ ఎత్తైన లేదా మరీ పొట్టి పడకపై ఎప్పుడూ పడుకోకూడదు. ఎల్లప్పుడూ శుభ్రమైన పడకపైనే పడుకోవాలి. అలాగే పడకపై కూర్చుని తినకూడదని గుర్తుంచుకోండి.

విశ్రాంతి నియమం

మెుత్తానికి వాస్తు, శాస్త్రాల ప్రకారం నిద్రపోయేటప్పుడు తల దక్షిణ దిశలో పెట్టుకోవడం అత్యుత్తమమైనది. దీనివల్ల ప్రశాంతమైన నిద్ర, మంచి ఆరోగ్యం కలుగుతాయి. తూర్పు వైపున కూడా తల పెట్టుకోవడం కూడా మంచిదే. ఇది జ్ఞాపకశక్తిని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఉత్తరం వైపు తల పెట్టి అస్సలు నిద్రపోకూడదు. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నమ్మకం.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe