వాహన ప్రమాదాల నివారణకు ఆధ్యాత్మిక చిట్కాలు: మనం ఇంట్లో ఏ శుభకార్యాన్ని మొదలుపెట్టినా, కొత్త వస్తువును కొనుగోలు చేసినా కచ్చితంగా దైవ ప్రార్థన చేసే అలవాటు మనకు ఉంటుంది. కొత్త వాహనం కొన్నప్పుడు కూడా వాహన పూజ చేస్తూ ఉంటాం. బండి కొన్న తర్వాత పూజ చేయడం వలన దుష్టశక్తులు అందులోకి చేరవని మన నమ్మకం. అలాగే వాహన పూజ చేయడం వలన ప్రయాణాలు సుఖమయంగా సాగుతాయని నమ్మకం. ఇది ఆచారమే కాదు, వాహనదారుడికి మానసిక స్థైర్యాన్ని, భద్రతాభావాన్ని కూడా కల్పించే ప్రక్రియ అని చెప్పొచ్చు.

అయితే కొత్త వాహనాన్ని కొన్నప్పుడు ఈ పనులు చేస్తే మీ ప్రయాణాలు సుఖమయంగా సాగుతాయి. ఏ ఇబ్బందులు ఉండవు. మరి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలి? పూజ ఏ విధంగా చేయాలి? ఇలాంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.
ప్రమాదాల నివారణకు ఆధ్యాత్మిక మార్గాలు:
కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినట్లయితే, ఆపదలను తొలగించడానికి హనుమంతుడికి మించిన దైవం ఏదీ లేదు. వాహన ప్రమాదాల నుంచి రక్షణ పొందాలంటే ఈ విధానాన్ని పాటిస్తే మంచిది.
శనివారం హనుమాన్ ఆలయం:
శనివారం సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్లండి. వాహనాన్ని దుష్టశక్తుల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలంటే ఇది అద్భుతమైన పరిహారం. స్వామివారి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని తమలపాకుతో కొంచెం తీసుకుని, ఆ సింధూరాన్ని వాహనం ముందు భాగంలో మూడు గీతలు గీయండి. అంటే మీరు తిరునామాలు దిద్దండి. ఇలా చేస్తే వాహనాలపై దుష్టశక్తుల ప్రభావం పడదు. ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది.
వీటిని రాయించండి:
వాహనంపై “శ్రీరామరక్ష” లేదా “శ్రీ క్షేమంకరి” అని రాస్తే చాలా ప్రయోజనాలను పొందవచ్చు.
దిష్టి నివారణకు:
వాహనంపై స్వస్తిక్ గుర్తు వేస్తే దిష్టి పడదు. కాబట్టి సింధూరంతో ఒక స్వస్తిక్ గుర్తు కూడా వేయడం మంచిది.
గతిమాన్ స్మరణ
{{/usCountry}}వాహనంపై స్వస్తిక్ గుర్తు వేస్తే దిష్టి పడదు. కాబట్టి సింధూరంతో ఒక స్వస్తిక్ గుర్తు కూడా వేయడం మంచిది.
గతిమాన్ స్మరణ
{{/usCountry}}హనుమంతుడు సోదరుడైన గతిమంతుడిని స్మరించుకుని కొంతమంది వాహనాలపై స్వస్తి గుర్తు వేస్తారు. గతి అంటే వేగం. వాహనం సరైన వేగంతో, సురక్షితంగా వెళ్లాలని భావిస్తూ ఈ సాంప్రదాయాన్ని చాలామంది అనుసరిస్తూ ఉంటారు.
స్వస్తిక్ గుర్తు శుభ సంకేతం:
స్వస్తిక్ గుర్తు అనేది ఒక పవిత్రమైన చిహ్నం మాత్రమే కాదు, సానుకూల శక్తికి కేంద్రం వంటిది. ఇంట్లో, వ్యాపారంలో, వాహనాలపై స్వస్తిక్ గుర్తు వేయడం వలన పనులు విజయవంతంగా సాగుతాయి. సాఫీగా కదులుతాయి. నాలుగు దిక్కుల నుంచి మనకు మేలు కలగాలంటే స్వస్తిక్ గుర్తు వేయడం మంచిది. ఇది వాహనం నాలుగు చక్రాల ప్రయాణాన్ని సాఫీగా సాగేలా చేస్తుందని నమ్మకం.
పూజతో పాటు వీటిని కూడా పాటించాలి:
వాహన పూజ చేయడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది.
ప్రాణ రక్షణ కోసం ట్రాఫిక్ నిబంధనలను కూడా పాటించాలి.
వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వేగ పరిమితిని మించి వాహనాన్ని నడపకూడదు.
హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి.
దైవ అనుగ్రహంతో పాటు మన జాగ్రత్త కూడా మనకు శ్రీరామరక్ష అని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.