వాహన ప్రమాదాల నివారణకు ఆధ్యాత్మిక చిట్కాలు: హనుమంతుడి అనుగ్రహంతో సురక్షిత ప్రయాణం!

వాహన ప్రమాదాల నివారణకు ఈ ఆధ్యాత్మిక చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. హనుమంతుడి అనుగ్రహంతో ప్రయాణాన్ని సురక్షితంగా పూర్తి చేయొచ్చు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినట్లయితే ఆపదలను తొలగించడానికి ఈ పరిహారాలని పాటిస్తే మంచిది. అలాగే ఇక్కడ చెప్పిన నిబంధనాలను కూడా ఆ పాటించేలా చూసుకోండి.

Published on: May 23, 2026, 12:00:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వాహన ప్రమాదాల నివారణకు ఆధ్యాత్మిక చిట్కాలు: మనం ఇంట్లో ఏ శుభకార్యాన్ని మొదలుపెట్టినా, కొత్త వస్తువును కొనుగోలు చేసినా కచ్చితంగా దైవ ప్రార్థన చేసే అలవాటు మనకు ఉంటుంది. కొత్త వాహనం కొన్నప్పుడు కూడా వాహన పూజ చేస్తూ ఉంటాం. బండి కొన్న తర్వాత పూజ చేయడం వలన దుష్టశక్తులు అందులోకి చేరవని మన నమ్మకం. అలాగే వాహన పూజ చేయడం వలన ప్రయాణాలు సుఖమయంగా సాగుతాయని నమ్మకం. ఇది ఆచారమే కాదు, వాహనదారుడికి మానసిక స్థైర్యాన్ని, భద్రతాభావాన్ని కూడా కల్పించే ప్రక్రియ అని చెప్పొచ్చు.

వాహన ప్రమాదాల నివారణకు ఆధ్యాత్మిక చిట్కాలు: హనుమంతుడి అనుగ్రహంతో సురక్షిత ప్రయాణం! (pinterest)
వాహన ప్రమాదాల నివారణకు ఆధ్యాత్మిక చిట్కాలు: హనుమంతుడి అనుగ్రహంతో సురక్షిత ప్రయాణం! (pinterest)

అయితే కొత్త వాహనాన్ని కొన్నప్పుడు ఈ పనులు చేస్తే మీ ప్రయాణాలు సుఖమయంగా సాగుతాయి. ఏ ఇబ్బందులు ఉండవు. మరి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలి? పూజ ఏ విధంగా చేయాలి? ఇలాంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.

ప్రమాదాల నివారణకు ఆధ్యాత్మిక మార్గాలు:

కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినట్లయితే, ఆపదలను తొలగించడానికి హనుమంతుడికి మించిన దైవం ఏదీ లేదు. వాహన ప్రమాదాల నుంచి రక్షణ పొందాలంటే ఈ విధానాన్ని పాటిస్తే మంచిది.

శనివారం హనుమాన్ ఆలయం:

శనివారం సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్లండి. వాహనాన్ని దుష్టశక్తుల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలంటే ఇది అద్భుతమైన పరిహారం. స్వామివారి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని తమలపాకుతో కొంచెం తీసుకుని, ఆ సింధూరాన్ని వాహనం ముందు భాగంలో మూడు గీతలు గీయండి. అంటే మీరు తిరునామాలు దిద్దండి. ఇలా చేస్తే వాహనాలపై దుష్టశక్తుల ప్రభావం పడదు. ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది.

వీటిని రాయించండి:

వాహనంపై “శ్రీరామరక్ష” లేదా “శ్రీ క్షేమంకరి” అని రాస్తే చాలా ప్రయోజనాలను పొందవచ్చు.

దిష్టి నివారణకు:

వాహనంపై స్వస్తిక్ గుర్తు వేస్తే దిష్టి పడదు. కాబట్టి సింధూరంతో ఒక స్వస్తిక్ గుర్తు కూడా వేయడం మంచిది.

గతిమాన్ స్మరణ

హనుమంతుడు సోదరుడైన గతిమంతుడిని స్మరించుకుని కొంతమంది వాహనాలపై స్వస్తి గుర్తు వేస్తారు. గతి అంటే వేగం. వాహనం సరైన వేగంతో, సురక్షితంగా వెళ్లాలని భావిస్తూ ఈ సాంప్రదాయాన్ని చాలామంది అనుసరిస్తూ ఉంటారు.

స్వస్తిక్ గుర్తు శుభ సంకేతం:

స్వస్తిక్ గుర్తు అనేది ఒక పవిత్రమైన చిహ్నం మాత్రమే కాదు, సానుకూల శక్తికి కేంద్రం వంటిది. ఇంట్లో, వ్యాపారంలో, వాహనాలపై స్వస్తిక్ గుర్తు వేయడం వలన పనులు విజయవంతంగా సాగుతాయి. సాఫీగా కదులుతాయి. నాలుగు దిక్కుల నుంచి మనకు మేలు కలగాలంటే స్వస్తిక్ గుర్తు వేయడం మంచిది. ఇది వాహనం నాలుగు చక్రాల ప్రయాణాన్ని సాఫీగా సాగేలా చేస్తుందని నమ్మకం.

పూజతో పాటు వీటిని కూడా పాటించాలి:

వాహన పూజ చేయడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది.

ప్రాణ రక్షణ కోసం ట్రాఫిక్ నిబంధనలను కూడా పాటించాలి.

వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వేగ పరిమితిని మించి వాహనాన్ని నడపకూడదు.

హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి.

దైవ అనుగ్రహంతో పాటు మన జాగ్రత్త కూడా మనకు శ్రీరామరక్ష అని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More