...
...
Next Story

శ్రావణ శుక్రవారం ప్రత్యేక పరిహారాలు.. ఇంట్లో సానుకూల శక్తి, ఐశ్వర్యం కోసం ఇలా చేయండి!

శ్రావణ శుక్రవారం నాడు వాయనం ఇవ్వడం, లక్ష్మీదేవికి దీపారాధన చేయడం, ఎర్రటి లేదా గులాబీ పూలతో పూజించడం, కొబ్బరికాయ–పాలు–బెల్లం నైవేద్యం పెట్టడం, కమల పుష్పాలు సమర్పించడం వంటి పూజా విధానాలను పాటించవచ్చు. ఉప్పు లేదా నిత్యావసర వస్తువుల దానం, అన్నదానం కూడా శుభప్రదంగా భావిస్తారు.

Published on: Aug 13, 2026, 14:00:47 IST
Advertisement

శ్రావణమాసం వచ్చేసింది. శ్రావణమాసంలో చాలా విశేష పర్వదినాలు ఉన్నాయి. శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలతో పాటుగా శ్రావణ శుక్రవారం రోజు కూడా శ్రావణ శుక్రవారం కూడా జరుపుకుంటాము. శ్రావణ మాసంలో శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాము. ఆ రోజు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. సుఖశాంతులు, ఐశ్వర్యం లభిస్తుంది.

శ్రావణ శుక్రవారం నాడు ఎలాంటి పరిహారాలను పాటించాలి?

శ్రావణ శుక్రవారం ప్రత్యేక పరిహారాలు.. ఇంట్లో సానుకూల శక్తి, ఐశ్వర్యం కోసం ఇలా చేయండి! (pinterest)
శ్రావణ శుక్రవారం ప్రత్యేక పరిహారాలు.. ఇంట్లో సానుకూల శక్తి, ఐశ్వర్యం కోసం ఇలా చేయండి! (pinterest)

ఈ శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం, శుక్రవారాలను సరిగ్గా సద్వినియోగం చేసుకొని ఈ ప్రత్యేక పరిహారాలను పాటించండి. ఇక అంతా శుభమే జరుగుతుంది. ఐశ్వర్యం, సుఖసంతోషాలు లభిస్తాయి.

శ్రావణ శుక్రవారం నాడు ఎలాంటి ప్రత్యేక పరిహారాలను పాటిస్తే మంచిది?

వాయనం: ఇంటికి ఆహ్వానించి పసుపు, కుంకుమలు, పూలు, పండ్లు, శక్తికి తగ్గట్టుగా వాయనం ఇవ్వండి. ఇది మంచి ఫలితాలను తీసుకొస్తుంది. ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.

లక్ష్మీదేవికి దీపారాధన: శుక్రవారం ఉదయాన్నే నిద్ర లేచి వెంటనే శుభ్రం చేసుకుని, పూజగదిని కూడా శుభ్రం చేసుకుని, నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

ఎర్రటి పూలతో పూజ: లక్ష్మీదేవికి ఎర్రటి పూలతో పూజ చేయండి. ఎరుపు లేదా గులాబీ రంగు పూలను భక్తితో అమ్మవారికి సమర్పించి, “ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః” అనే మంత్రాన్ని జపించండి.

కొబ్బరికాయను సమర్పించండి: అమ్మవారికి పండ్లు, పాలు, బెల్లంతో పాటుగా కొబ్బరికాయను కూడా నివేదన చేయండి. ఇది కూడా మంచి ఫలితాలను తీసుకొస్తుంది.

కమల పుష్పాలతో పూజ: అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమల పుష్పాలతో పూజ చేయండి. లక్ష్మీదేవికి కమలం అంటే చాలా ఇష్టం. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

అన్నదానం: పేదలకు, అవసరమైన వారికి అన్నదానం చేస్తే కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి శ్రావణ శుక్రవారం నాడు కుదిరితే ఇది కూడా చేయడం మంచిది.

ప్రధాన ద్వారం దగ్గర దీపం: శ్రావణ శుక్రవారం నాడు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన చేయండి. దీంతో శుభ ఫలితాలు కలుగుతాయి. సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.

ఇల్లు శుభ్రంగా: శుక్రవారం నాడు ఇల్లు మురికిగా ఉండకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. పూజగది, ప్రధాన ద్వారాలు పరిశుభ్రంగా ఉంచండి. దీనితో మంచి ఫలితాలను చూడొచ్చు.

లక్ష్మీ అష్టోత్తరం: వీలైతే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లేదా లక్ష్మీ స్తోత్రాలు పఠించండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మంచి ఫలితాలను చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe