...
...
Next Story

శ్రావణ మాసం వచ్చేసింది.. శివుడు, లక్ష్మీదేవి, గౌరీదేవి అనుగ్రహం కోసం ఈ రోజులు మిస్ కావద్దు!

ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం కొనసాగుతుంది. శివారాధనకు ఎంతో విశిష్టమైన ఈ మాసంలో శ్రావణ సోమవారాలు, మంగళగౌరీ వ్రతాలు, శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మీ వ్రతం, నాగ పంచమి, రక్షాబంధన్ వంటి ముఖ్యమైన పర్వదినాలు వస్తాయి.

Published on: Aug 13, 2026, 08:00:22 IST
Advertisement

ఎంతో పవిత్రమైన శ్రావణమాసం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం ఉంటుంది. ఈ నెల అంతా కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు. శ్రావణ మాసంలో ముఖ్యమైన రోజులు ఎప్పుడు వచ్చాయి? తేదీలతో పాటుగా పూర్తి వివరాలను ఈరోజు తెలుసుకుందాం.

శ్రావణ మాసం 2026

శ్రావణ మాసం వచ్చేసింది.. శివుడు, లక్ష్మీదేవి, గౌరీదేవి అనుగ్రహం కోసం ఈ రోజులు మిస్ కావద్దు! (pinterest)
శ్రావణ మాసం వచ్చేసింది.. శివుడు, లక్ష్మీదేవి, గౌరీదేవి అనుగ్రహం కోసం ఈ రోజులు మిస్ కావద్దు! (pinterest)

ఈ నెలలో వచ్చిన ముఖ్యమైన పర్వదినాలు, శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారం గురించి కూడా చూసేద్దాం. రేపు అనగా ఆగస్టు 13 నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రావణమాసం ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు కొనసాగుతుంది.

శ్రావణ మాసంలో జరుపుకోవాల్సిన ముఖ్యమైన రోజులు

శివారాధనకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. శ్రావణ సోమవారాల్లో శివుని ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. మరి ఏ రోజుల్లో శ్రావణ సోమవారం పూజ చేయాలో చూద్దాం.

ఆగస్టు 17 - మొదటి సోమవారం.

ఆగస్టు 24 - రెండవ సోమవారం.

ఆగస్టు 31 - మూడవ సోమవారం.

సెప్టెంబర్ 7 - 4వ సోమవారం.

నాలుగు సోమవారాల్లో శివుని ప్రత్యేకించి ఆరాధించి, శివ మంత్రాన్ని జపించి, శివుడికి అభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.

శ్రావణ మంగళవారాలు

శ్రావణ మంగళవారాలు నాడు మంగళ గౌరీ వ్రతం చేయడం వలన గౌరీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. సౌభాగ్యం కలుగుతుంది. మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించేవారు పాటించండి.

ఆగస్టు 18 - మొదటి శ్రావణ మంగళవారం.

సెప్టెంబర్ 1 - మూడవ శ్రావణ మంగళవారం.

సెప్టెంబర్ 8 - నాలుగవ శ్రావణ మంగళవారం.

ఈ నాలుగు రోజుల్లో గౌరీదేవిని ఆరాధించడానికి, మంగళ గౌరీ వ్రతం జరపడానికి మంచిది.

శ్రావణ శుక్రవారాలు

శ్రావణ శుక్రవారం రోజు కూడా మహాలక్ష్మీదేవిని, గౌరీదేవిని, వరలక్ష్మీదేవిని ఆరాధించచ్చు. 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. ఐదవ శుక్రవారం అమావాస్య వచ్చింది.

ఆగస్టు 14 - మొదటి శ్రావణ శుక్రవారం.

ఆగస్టు 21 - రెండవ శ్రావణ శుక్రవారం. ఆరోజే వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవాలి.

ఆగస్టు 28 - మూడవ శ్రావణ శుక్రవారం.

సెప్టెంబర్ 4 - 4వ శ్రావణ శుక్రవారం.

సెప్టెంబర్ 11 -శుక్రవారం వచ్చింది, కానీ ఆ రోజు అమావాస్య వచ్చేసింది.

నాగ పంచమి 2026

నాగ పంచమి ఆగస్టు 17, సోమవారం నాడు వచ్చింది. కొన్ని పంచాంగాల ప్రకారం ఆ రోజు సోమవారం కూడా వచ్చింది కాబట్టి శివుని ఆరాధించడం మంచిది. నాగదేవతను కూడా భక్తిశ్రద్ధలతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

రక్షాబంధన్ 2026

ఆగస్టు 28, శుక్రవారం నాడు రక్షాబంధన్ వచ్చింది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి పద్ధతుల్ని పాటించచ్చు. కొత్త యజ్ఞోపవీత ధారణ, అక్కాచెల్లెళ్లతో అన్నదమ్ములు రాఖీ పౌర్ణమిని చేసుకోవచ్చు. అలాగే పౌర్ణమి నాడు చేసే ఆచారాలను, పద్ధతులను కూడా పాటించొచ్చు. సత్యనారాయణ వ్రతం వంటివి కూడా చేసుకోవచ్చు.

శ్రావణ మాసంలో ప్రధానంగా శివుడు, లక్ష్మీదేవి, గౌరీదేవిని ఆరాధిస్తే మంచిది. సోమవారాలు అభిషేకం, శుక్రవారం నాడు లక్ష్మీ పూజ, మంగళవారం మంగళ గౌరీ వ్రతం వంటివి పాటించచ్చు. కాబట్టి శ్రావణమాసం సరిగ్గా సద్వినియోగం చేసుకుని, ఆ భగవంతుని అనుగ్రహంతో సంతోషంగా ఉండండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks