చంద్రుడు–అంగారకుడి కలయికతో లక్ష్మీ యోగం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉందంటే?

చంద్రుడు, అంగారకుడి కలయికతో మిథున రాశిలో ఏర్పడిన లక్ష్మీ యోగంతో పాటు ఇతర గ్రహాల ప్రత్యేక సంచారాలు 12 రాశులపై భిన్నమైన ప్రభావాలను చూపుతాయని జ్యోతిష్య విశ్లేషణ చెబుతోంది. మేషం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక, వ్యక్తిగత జీవితంలో అనుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది.

Published on: Aug 9, 2026, 10:31:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆకాశంలో గ్రహాల గమనం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గ్రహాల కలయిక, నక్షత్ర మార్పులు మనుషుల జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంటాయి. తాజాగా చంద్రుడు, అంగారకుడు కలయికతో పాటు మంగళుడి నక్షత్రంలో చంద్ర సంచారం జరుగుతోంది. ముఖ్యంగా మిథున రాశిలో ఈ గ్రహాల కలయిక వల్ల 'లక్ష్మీ యోగం' రూపుదిద్దుకుంది.

చంద్రుడు–అంగారకుడి కలయికతో లక్ష్మీ యోగం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉందంటే? (pinterest)
చంద్రుడు–అంగారకుడి కలయికతో లక్ష్మీ యోగం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉందంటే? (pinterest)

అయితే, ఇదే సమయంలో సూర్యుడు, బుధుడు, గురుడు కర్కాటక రాశిలోనూ, కేతువు సింహంలోనూ, శుక్రుడు కన్యలోనూ, రాహువు కుంభంలోనూ, శని మీన రాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహాల ప్రత్యేక స్థితిగతుల కారణంగా మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.

మేష రాశి: రాశి వారు ఈ కాలంలో అత్యంత పరాక్రమంతో ముందుకు సాగుతారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార రంగంలో ఊహించని విజయాలు సాధిస్తారు. ప్రేమ, సంతాన విషయాల్లో కొంత మందకొడి వాతావరణం ఉన్నప్పటికీ, వ్యాపారం మాత్రం అద్భుతంగా సాగుతుంది. రోజూ బంజరంగబలిని దర్శించుకోవడం మంచిది.

వృషభ రాశి: చేతికి కొత్తగా ధనం అందుతుంది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే సూచనలున్నాయి. అయితే ఎటువంటి పెట్టుబడులు పెట్టవద్దు. మాటల విషయంలో సంయమనం పాటించండి. మసూర పప్పు లేదా ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం శుభప్రదం.

మిథున రాశి: లక్ష్మీ యోగం ఏర్పడినప్పటికీ, ఈ రాశి వారికి కొంత ఇబ్బందికర సమయం నడుస్తోంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. శరీరంలో శక్తి స్థాయిలు బాగున్నప్పటికీ, బీపీ పెరిగే అవకాశం ఉంది. సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం శ్రేయస్కరం.

కర్కాటక రాశి: ఖర్చులు విపరీతంగా పెరగడం మనసును ఆందోళనకు గురిచేస్తుంది. తలనొప్పి, కంటి నొప్పులు వచ్చే సూచనలున్నాయి. ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు కాస్త ప్రభావితం అవుతాయి. ప్రస్తుతానికి కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి.

సింహ రాశి: ఆర్థికంగా ఈ కాలం మీకు అద్భుతంగా ఉంది. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. పాత మార్గాల ద్వారా కూడా ధనం చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడటంతో పాటు శుభవార్తలు వింటారు. పసుపు రంగు వస్తువులను దగ్గర ఉంచుకోండి.

కన్యా రాశి: కోర్టు వ్యవహారాలు, వివాదాలలో విజయం మీ సొంతం అవుతుంది. వ్యాపారంలో తిరుగులేని విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ, సంతాన మరియు వ్యాపార స్థితులు అత్యంత ఆశాజనకంగా ఉన్నాయి. ఎరుపు రంగు వస్తువులను దానం చేయండి.

తులా రాశి: ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకుంటారు. గతంలో ఎదుర్కొన్న రిస్క్‌ల నుంచి బయటపడతారు. ప్రేమ, సంతాన సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. వ్యాపార రంగం లాభసాటిగా సాగుతుంది. ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం మంచిది.

వృశ్చిక రాశి:సమయంలో ప్రయాణాలు లేదా పనుల్లో చిన్నపాటి ప్రమాదాలు, గాయాలు జరిగే అవకాశం ఉంది. పరిస్థితులు కొంత అనుకూలంగా లేవు. ఆరోగ్యం మధ్యస్తంగా ఉంటుంది. పసుపు రంగు వస్తువులను మీతో ఉంచుకోండి.

ధనుస్సు రాశి: వ్యక్తిగత జీవితం మరియు వృత్తి జీవితం రెండింటిలోనూ అద్భుతమైన సమయం నడుస్తోంది. జీవిత భాగస్వామి తోడు లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రేమికులకు ఇది కలకాలం గుర్తుండిపోయే సమయం.

మకర రాశి: శత్రువులపై మీ ఆధిపత్యం ఎప్పటికీ నిలుస్తుంది. గూఢ విషయాలపై అవగాహన పెరుగుతుంది, పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, అడ్డంకులు ఎదురైనా విజయం మీదే అవుతుంది. కాళికాదేవిని దర్శించుకోవడం మంచిది.

కుంభ రాశి: మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రేమ బంధాలలో అకస్మాత్తుగా వాదనలు, మనస్పర్థలు వచ్చే సూచనలున్నవి. ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. వినాయకుడిని ప్రార్థించడం శుభప్రదం.

మీన రాశి: కొత్తగా భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే బలమైన యోగాలున్నాయి. అయితే గృహంలో చిన్నపాటి కలహాలు వచ్చే అవకాశం ఉన్నందున చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారం మాత్రం అద్భుతంగా ముందుకు వెళ్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More