...
...
Next Story

శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు: ఉద్యోగం, డబ్బు, వివాహం, కుటుంబ సమస్యలకు పరిహారాలివే!

శ్రావణ మాసంలోని సోమవారాలకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. శివలింగానికి జలాభిషేకం చేసి, బిల్వ పత్రాలు సమర్పించి, ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించడం శుభప్రదంగా భావిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కోసం శివారాధన చేయడంతో పాటు పేదలకు లేదా అవసరమైన వారికి దానం చేయాలని సూచిస్తున్నారు.

Published on: Aug 24, 2026, 08:02:02 IST
Advertisement

తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భోళా శంకరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం ఇది. ఈరోజు శ్రావణ సోమవారం వచ్చింది. ఈ సోమవారాల్లో పూజలు, వ్రతాలు ఆచరించి, శివయ్యను ఆరాధిస్తే విశేష ఫలితం దక్కుతుందని పండితులు స్పష్టం చేస్తున్నారు. కేవలం నీటితో అభిషేకం చేసినా భోళా శంకరుడు ప్రసన్నుడవుతాడని ధార్మిక విశ్వాసం.

ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి ప్రత్యేక పూజలు

శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు: ఉద్యోగం, డబ్బు, వివాహం, కుటుంబ సమస్యలకు పరిహారాలివే!
శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు: ఉద్యోగం, డబ్బు, వివాహం, కుటుంబ సమస్యలకు పరిహారాలివే!

ప్రస్తుతం కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతున్నవారు, లేదా వ్యాపారంలో ఆశించిన లాభాలు రాక సతమతమవుతున్నవారు సోమవారం నాడు ఆలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేయాలి. అనంతరం మారేడు దళాలు (బిల్వ పత్రాలు) సమర్పించి, మనసారా శివనామ స్మరణ చేయాలి. 'ఓం నమః శివాయ' మంత్రాన్ని భక్తితో జపిస్తూ ఉద్యోగంలో ఎదుగుదల కోసం ప్రార్థించాలి. ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవడం మంచిది.

ఆర్థిక ఇబ్బందులొద్దంటే ఈ దానాలు చేయండి

డబ్బుకు సంబంధించిన సమస్యలు వేధిస్తుంటే, ఈ సోమవారం నాడు శివారాధన ముగిసిన తర్వాత పేదవారికి లేదా ఆశ్రమంలోని వారికి భోజనం పెట్టడం లేదా శక్తి కొద్దీ అవసరమైన వస్తువులను దానం చేయడం శ్రేయస్కరం. శివలింగానికి నీరు సమర్పించిన అనంతరం కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. దానధర్మాలు చేసేటప్పుడు ఆడంబరాలకు పోకుండా మనస్ఫూర్తిగా చేయడం ముఖ్యం.

వివాహ అడ్డంకులు తొలగిపోవడానికి..

పెళ్లి ఆలస్యం అవుతున్న యువతీ యువకులు సోమవారం రోజున మహాశివుడితో పాటు జగన్మాత పార్వతీ దేవిని పూజించాలి. శివలింగానికి జలాభిషేకం చేసి బిల్వ పత్రాలు సమర్పించిన తర్వాత, అమ్మవారికి పువ్వులు సమర్పించి మాంగల్య ప్రాప్తి కోసం వేడుకోవాలి. శివపార్వతుల సంయుక్త పూజ దాంపత్య జీవితంలో సుఖసంతోషాలను ఇస్తుందని నమ్ముతారు.

కుటుంబంలో శాంతి కోసం.. పరిహారాలు

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks