బిజీ లైఫ్‌లో ప్రశాంతంగా ఎలా ఉండాలి? వేల ఏళ్ల క్రితమే గీతలో చెప్పిన శ్రీకృష్ణుడి బోధన ఇదే!

నేటి బిజీ జీవితంలో మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన బోధనలు మనశ్శాంతికి మార్గదర్శకంగా నిలుస్తాయి. రాగద్వేషాలకు అతీతంగా ఉండటం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం, ఫలితాలపై అతిగా ఆశపడకుండా కర్తవ్యంపై దృష్టి పెట్టడం ద్వారా అశాంతిని తగ్గించుకోవచ్చని గీత బోధిస్తుంది.

Published on: Aug 11, 2026, 08:00:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేటి బిజీ లైఫ్‌లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి శ్రీమద్భగవద్గీత ఎలా మార్గదర్శకం చేస్తుందో తెలుసుకోండి. ఇంద్రియ నిగ్రహం, ఆత్మసంయమనం ద్వారా అశాంతిని దూరం చేసుకునే మార్గాలు.

బిజీ లైఫ్‌లో ప్రశాంతంగా ఎలా ఉండాలి? వేల ఏళ్ల క్రితమే గీతలో చెప్పిన శ్రీకృష్ణుడి బోధన ఇదే!
బిజీ లైఫ్‌లో ప్రశాంతంగా ఎలా ఉండాలి? వేల ఏళ్ల క్రితమే గీతలో చెప్పిన శ్రీకృష్ణుడి బోధన ఇదే!

నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి, ఆందోళన ప్రతి ఒక్కరిని నీడలా వెంటాడుతున్నాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఆఫీస్ టెన్షన్లు, భవిష్యత్తు గురించిన బెంగ, కుటుంబ బాధ్యతల ఒత్తిడి మనిషిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఈ బిజీ వాతావరణంలో చాలా మంది ప్రశాంతతను కోల్పోయి సతమతమవుతున్నారు. ఇలాంటి అశాంతి సమయాల్లోనే వేల ఏళ్ల క్రితం శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన భగవద్గీత సర్వరోగ నివారణిలా పనిచేస్తుంది. గీతలోని ప్రతి శ్లోకం నేటి ఆధునిక మానవుడి సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది.

మానసిక ప్రశాంతతకు గీత మార్గం

శ్రీమద్భగవద్గీతలోని రెండవ అధ్యాయం 64వ శ్లోకం మానసిక ప్రశాంతతకు అత్యంత కీలకమైన సూత్రం చెబుతోంది. దీని అర్థం ఏమిటంటే.. ఎవరైతే రాగద్వేషాలకు అతీతంగా ఉంటూ, తన ఇంద్రియాలను పూర్తిగా అణచివేసి, మనసును నియంత్రణలో ఉంచుకుంటాడో, ఆ వ్యక్తి మాత్రమే అంతిమంగా శాంతిని పొందగలడు.

శ్రీకృష్ణుడి ఈ బోధన నేటి డిజిటల్ యుగంలోనూ వంద శాతం వర్తిస్తుంది. నేడు మనిషిని ఎక్కువగా బాధిస్తున్నది ఇంద్రియాలపై పట్టులేకపోవడమే. కోరికలు హద్దు మీరుతున్న కొద్దీ అసంతృప్తి పెరిగి ఒత్తిడి తలెత్తుతుంది.

పరిస్థితులు కాకపోయినా.. ఆలోచనా విధానమే సమస్య

చాలా మంది తమ ఇబ్బందులకు కేవలం బాహ్య పరిస్థితులే కారణమని భావిస్తుంటారు. కానీ, గీత ఇక్కడ మనకొక పెద్ద సత్యాన్ని బోధిస్తుంది. సమస్య బయట పరిస్థితుల్లో లేదు, వాటిని మనం చూసే విధానంలో, స్పందించే తీరులోనే అసలు లోపం ఉంటుందని వివరిస్తుంది.

ఏదైనా ఒక ఫలితంపై అతిగా ఆశపడటం, పక్కవారితో మనల్ని పోల్చుకోవడం, ప్రతిదీ మనం అనుకున్నట్లే జరగాలని కోరుకోవడం వల్ల నిరాశ పెరుగుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, మన దృక్పథాన్ని మార్చుకుంటే కొండంత కష్టమైనా మార్చచ్చు.

మనసు, ఇంద్రియాలపై పట్టు ఎందుకు ముఖ్యం?

శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఎవరైతే తన మనసును, ఇంద్రియాలను శాసించగలరో వారు జీవితంలో ఎలాంటి కష్టకాలం ఎదురైనా చలించిపోరు. అలాంటి వ్యక్తులు కోపం, అసూయ, భయం వంటి రుణాత్మక భావాలను తనపై ఎప్పటికీ ఆధిపత్యం చెలాయించనివ్వరు. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని, మానసిక దారుఢ్యాన్ని ఇస్తుంది. మనసును అదుపులో ఉంచుకోవడం మాటలు చెప్పినంత సులువు కాదు. కానీ, క్రమమైన అభ్యాసం, ఓర్పు, ఆత్మపరిశీలన ద్వారా ఇది పూర్తిగా సాధ్యమవుతుంది. నిజమైన స్వేచ్ఛ అనేది ఇంద్రియ నిగ్రహం ద్వారానే వస్తుంది.

చిన్న అలవాట్లతోనే పెద్ద మార్పులు

గీతా సారం కేవలం ఆధ్యాత్మిక విషయాలకే పరిమితం కాలేదు, అది పూర్తిగా ఆచరణాత్మకమైనది. ప్రతిరోజూ కాసేపు ధ్యానం చేయడం, అనవసరమైన పోలికలకు స్వస్తి చెప్పడం, వర్తమానంలో బతకడం నేర్చుకోవడం వంటి చిన్న చిన్న జీవనశైలి మార్పులు మానసిక ఒత్తిడిని తీసుకొస్తాయి. జీవితంలోని ప్రతీదీ మన కంట్రోల్‌లో ఉండదు. కానీ, వాటికి మనం ఇచ్చే స్పందన మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. చిన్న అలవాట్లే భవిష్యత్తులో పెద్ద మార్పుని తెస్తాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More