హిందూ ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో వచ్చే అమావాస్య తిథి పితృ దేవతల ఆరాధనకు, పూర్వీకుల రుణం తీర్చుకోవడానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది శ్రావణ అమావాస్య రెండు రోజుల పాటు రానుంది.

సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 10:33 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 11 ఉదయం 8:56 గంటలకు ఈ తిథి ముగుస్తుంది. అయితే ఉదయ తిథి ప్రకారం సెప్టెంబర్ 11నే పూజా కార్యక్రమాలు, దానధర్మాలు నిర్వహించడం శ్రేయస్కరం. ఈ పవిత్ర రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం ద్వారా జీవితంలోని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, కుటుంబంలో సిరిసందపలు వర్ధిల్లుతాయని విశ్వసిస్తారు.
ఆర్థిక ప్రగతికి తులసి జపం
డబ్బు సమస్యలతో సతమతమవుతున్నవారు భద్రపద అమావాస్య రోజున తులసి మాల సహాయంతో 108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించాలి. ఇది ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని తొలగించి సానుకూల వాతావరణాన్ని తీసుకొస్తుంది. అలాగే ఈ రోజున పితృస్తోత్రం, పితృ కవచం పఠించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభించి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మూగజీవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హింసించకూడదు, వీలైనంతగా ఆవులకు సేవ చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపారాధన
ధనలక్ష్మి కటాక్షం కోసం పూజా సమయంలో వెలిగించే ఆవు నెయ్యి దీపంలో కొద్దిగా కుంకుమ, రెండు లవంగాలు వేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఇక ఉదయాన్నే రావి చెట్టుకు నీరు సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. పితృ దోషాల నుంచి విముక్తి పొందడానికి సాయంత్రం వేళ రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం అత్యంత శుభప్రదం.
ఇంటి శుభ్రత - దాన ధర్మాలు
ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమికొట్టడానికి అమావాస్య రోజున ఇంటిని శుభ్రపరిచేటప్పుడు నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఇల్లు తుడవాలి. ఈ రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం, ఫలదానం చేయడం ద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇంటికి దక్షిణ దిశలో ఆవనూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించాలి. ఇంటి ఈశాన్య మూలన ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరం వెలిగేలా ఆవు నెయ్యి దీపాన్ని ఉంచడం వల్ల సానుకూల స్పందనలు పెరిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారంపై, అవి పూర్తిగా నిజమైనవి మరియు ఖచ్చితమైనవి అని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడి సలహా తీసుకోండి.
{{/usCountry}}నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారంపై, అవి పూర్తిగా నిజమైనవి మరియు ఖచ్చితమైనవి అని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడి సలహా తీసుకోండి.
{{/usCountry}}