కర్పూరంతో ఈ 4 పరిహారాలు చేస్తే ధనలక్ష్మి అనుగ్రహం.. ఆర్థిక ఇబ్బందులు దూరం!
హిందూ ధర్మంలో కర్పూరానికి విశిష్టమైన స్థానం ఉంది. పూజలో కర్పూర హారతి ఇవ్వడం మాత్రమే కాకుండా, జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం కర్పూరంతో చేసే కొన్ని పరిహారాలు ఆర్థికాభివృద్ధి, సానుకూల శక్తి, ఐశ్వర్యం, శాంతి, శ్రేయస్సును కలిగిస్తాయని విశ్వసిస్తారు.
హిందూ ధర్మంలో కర్పూరానికి ఎంతో విశిష్టత ఉంది. పవిత్రమైనదిగా కూడా భావిస్తాము. పూజ సమయంలో దీపారాధన చేయడంతో పాటు కర్పూరాన్ని కూడా తప్పక ఉపయోగిస్తాము. దేవుడికి హారతి ఇవ్వడానికే దీపాన్ని వెలిగిస్తే, పూజ చివరన కర్పూరంతో హారతి ఇస్తాము.

జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కర్పూరంతో చేసే కొన్ని పరిహారాలు అనేక విధాలుగా లాభాలను తీసుకువస్తాయి. కొన్ని ప్రభావవంతమైన పరిహారాలు నిలిచిపోయిన ధన ప్రవాహాన్ని మళ్లీ ప్రారంభించేందుకు సహాయం చేస్తాయి. అదృష్టం కూడా పెరుగుతుంది.
ప్రతికూల శక్తులు తొలగిపోతాయి
మత విశ్వాసాల ప్రకారం చూస్తే, కర్పూరాన్ని సరైన విధంగా ఉపయోగిస్తే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి. అటువంటి సులువైన పరిహారాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కర్పూర పరిహారాలను మీరు కూడా పాటిస్తున్నారా?
స్నానం నీటిలో కలపండి
స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లలో కొంచెం కర్పూరాన్ని కలపండి. ఆ నీటితో స్నానం చేయడం వలన అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు సాఫీగా సాగకపోతున్నట్లయితే ఈ పరిహారాన్ని మీరు కచ్చితంగా ప్రయత్నించండి. స్నానం చేసే నీళ్లలో కర్పూరాన్ని వేసి స్నానం చేయడం వలన మనసు, శరీరం రెండూ పవిత్రమవుతాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. గ్రహాలు కూడా మంచి ఫలితాలను తీసుకొస్తాయి.
కర్పూరం-లవంగాల పరిహారం
వెండి పాత్రలో కర్పూరం, లవంగాలను పెట్టి లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ ఒక్క పరిహారం ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా గట్టెక్కించేలా చేస్తుంది. కొత్త ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి కూడా వీలవుతుంది.
ఇక్కడ కర్పూరాన్ని వెలిగిస్తే మంచిది
వాస్తు దోషాలు తొలగిపోవాలంటే మనీ ప్లాంట్ దగ్గర కర్పూరాన్ని వెలిగించండి. ఒకవేళ వెలిగించడం కుదరకపోతే కర్పూరాన్ని కుండీ పక్కన పెట్టండి. దీని వలన సానుకూల శక్తి పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది.
ఆర్థిక అభివృద్ధి
అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు, వ్యాపారంలో అభివృద్ధి సాధించాలనుకునే వారు సాయంత్రం పూట కర్పూరాన్ని వెలిగిస్తే మంచిది. 108 సార్లు మహాలక్ష్మి మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన, ధాన్యాలకు కొరత ఉండదు. అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు.
జపించాల్సిన మంత్రం: ఓం శ్రీ మహాలక్ష్మీ నమః
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


