మంచంపై కూర్చుని వర్క్ చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఇది పెద్ద తప్పే!

వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్నవారిలో చాలామంది మంచం పైనే కూర్చుని పని చేస్తుంటారు. అయితే వాస్తు, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ అలవాటు దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని చెబుతారు. మంచంపై రాహు, కేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అక్కడ పని చేయడం వల్ల  సమస్యలు ఎదురయ్యే అవకాశముందని నమ్మకం.

Published on: Jul 28, 2026, 14:01:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ మధ్యకాలంలో చాలా మంది వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్నారు. ఆఫీసులో పనిచేసే వారికి టేబుల్స్, సరైన సౌకర్యాలు ఉంటాయి. ఇంట్లో పని చేసేవారు మాత్రం మంచం మీద కూడా పని చేస్తూ ఉంటారు. ఇంట్లో వర్క్ చేసేవారు మంచం పై కూర్చుని వర్క్ చేయొచ్చా? వాస్తు, జ్యోతిష్యం ప్రకారం అలా చేయడం మంచిదా, కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మంచంపై కూర్చుని వర్క్ చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఇది పెద్ద తప్పే! (pinterest)
మంచంపై కూర్చుని వర్క్ చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఇది పెద్ద తప్పే! (pinterest)

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిలో చాలా మంది మంచం పైన కూర్చుని పని చేస్తూ ఉంటారు. వాస్తు, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ అలవాటు దీర్ఘకాలంలో అనేక ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది. ఇక మరి దీని వలన కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాహువు, కేతువుల ప్రభావం

రాహువు, కేతువుల ప్రభావంతో కెరీర్‌లో సవాళ్లు ఎదుర్కోవచ్చని పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం మంచం పై రాహువు, కేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుందట. అందుకనే మంచం పైన కూర్చుని పని చేయకూడదు. అలా చేయడం వలన బద్ధకం, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి.

కొన్ని సంప్రదాయ విశ్వాసాల ప్రకారం, ఇలా మంచం పై కూర్చుని పని చేయడం వలన సహోద్యోగులు, ఉన్నతాధికారులతో అపార్థాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయట. ఫలితంగా ఉద్యోగంలో ఎదుగుదల తగ్గిపోతుంది. కొత్త అవకాశాలు కూడా రావని చెబుతారు.

ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం

వాస్తు ప్రకారం మంచం పై కూర్చుని పని చేయడం, భోజనం చేయడం మంచిది కాదు. ఇది ఇంట్లో సానుకూల శక్తిని ప్రభావితం చేస్తుంది. ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇవన్నీ సంప్రదాయ వాస్తు, జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన విషయాలు.

విశ్రాంతి, కర్మ శక్తుల మధ్య అసమతుల్యత

జ్యోతిష్యం ప్రకారం చూస్తే, మంచం శుక్రుడు, చంద్రుడితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. విశ్రాంతి, సుఖం, మానసిక ప్రశాంతతకు ఈ రెండు గ్రహాలు ప్రతీకలు. పని చేసే ప్రదేశం బుధుడు, శనితో అనుసంధానమై ఉంటుంది. జ్ఞానం, క్రమశిక్షణ, కర్మకు ఇవి ప్రతీకలు.

అందుకనే మంచం పై కూర్చుని ఆఫీస్ పనులు చేయకూడదు. ఇలా చేయడం వల్ల విశ్రాంతి, కర్మ శక్తుల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా ఏకాగ్రత తగ్గడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు రావడం, పనితీరు తగ్గిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More