Lizard Falling: మీపై బల్లి పడిందా? ఏ శరీర భాగాలపై పడితే రాజయోగం కలుగుతుంది, ఎప్పుడు నష్టాలు సంభవిస్తాయో తెలుసుకోండి!

Lizard Falling: బల్లి పడిందా? ఏ శరీర భాగాలపై పడితే రాజయోగం? బల్లి పడటాన్ని శకున శాస్త్రం కేవలం యాదృచ్ఛికంగా భావించదు. శరీరంలోని ఏ భాగంపై బల్లి పడితే ఎలాంటి ఫలితం ఉంటుందో, అది లాభమా లేక నష్టమా అనే వివరాలు సాముద్రిక శాస్త్రం ద్వారా ఇక్కడ తెలుసుకోండి. 

Published on: May 22, 2026, 13:54:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది ఇళ్లలో ఎక్కువ బల్లులు ఉంటాయి. బల్లులు ఆకస్మాత్తుగా మనపై పడితే భయం కలుగుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం చూసినట్లయితే మనపై బల్లి పడడం ప్రమాదం లేదా దురదృష్టంగా భావించకూడదు. భవిష్యత్తు సూచనగా అర్థం చేసుకోవాలి. బల్లి ఒక శకునం వంటిదని పెద్దలు అంటూ ఉంటారు.

Lizard Falling: మీపై బల్లి పడిందా? ఏ శరీర భాగాలపై పడితే రాజయోగం కలుగుతుంది, ఎప్పుడు నష్టాలు సంభవిస్తాయో తెలుసుకోండి! (pinterest)
Lizard Falling: మీపై బల్లి పడిందా? ఏ శరీర భాగాలపై పడితే రాజయోగం కలుగుతుంది, ఎప్పుడు నష్టాలు సంభవిస్తాయో తెలుసుకోండి! (pinterest)

శరీర భాగంపై బల్లి పడితే దాని ఫలితం ఎలా ఉంటుంది?

శరీరంలోని ఒక్కో భాగంపై బల్లి పడినప్పుడు ఒక్కో రకమైన ఫలితం ఉంటుందని నమ్ముతారు. కొన్నిసార్లు అదృష్టానికి చిహ్నంగా భావించాలి. మరికొన్నిసార్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్‌గా తీసుకోవాలి. మరి ఏ శరీర భాగంపై బల్లి పడితే ఎలాంటి ఫలితం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

నుదుటిపై బల్లి

బల్లి నేరుగా నుదుటిపై పడితే సామాజిక గౌరవానికి, పాత బంధాలకు సంకేతంగా భావిస్తారు. ఈ భాగంపై బల్లి పడినట్లయితే అత్యంత ఆత్మీయులు, పాత స్నేహితులు లేదా బంధువులను కలిసే అవకాశం ఉందని శాస్త్రం తెలుపుతోంది. ఈ భాగంపై బల్లి పడితే శుభవార్తలు పొందవచ్చు. నిలిచిపోయిన పనులు కూడా మళ్లీ పూర్తవుతాయి.

తలపై బల్లి

శిరస్సుపై బల్లి పడినట్లయితే ఆర్థిక లాభం అని అర్థం చేసుకోవాలి. ఈ భాగంపై బల్లి పడటం వలన గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయట. జీవితంలో ఒక పెద్ద అవకాశం మీ వద్దకు రాబోతోందని అర్థం. కెరీర్‌లో కూడా మంచి మార్పులను చూడొచ్చు.

కాళ్లు, చేతులపై బల్లి

కాళ్లు, చేతులపై బల్లి పడితే ఏమవుతుందనే విషయానికి వస్తే, చేతిపై బల్లి పడితే విజయాన్ని అందుకోవచ్చు. ఆర్థికంగా కూడా లాభాలు కలగబోతున్నాయని అర్థం. కాళ్లపై బల్లి పడితే అధిక శ్రమ, పనుల్లో సవాళ్లకు సంకేతంగా భావించాలి. మీరు చాలా బిజీ అయిపోవచ్చు. మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి.

ముక్కుపై బల్లి

ముక్కుపై బల్లి పడితే ఆరోగ్యానికి సంబంధించిన హెచ్చరికగా అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే ఆహారపు అలవాట్లు, జీవనశైలి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

వీటిని మూఢనమ్మకాలుగా చూడకూడదు. సంస్కృతిలో భాగమైనటువంటి బల్లి శాస్త్రం లేదా శకున శాస్త్రం కోణంలో అర్థం చేసుకుంటే మంచిది. ఏదేమైనా బల్లి పడితే ఆందోళన చెందకండి. స్నానం చేసి ఇష్టదైవాన్ని ఆరాధించండి.

భుజంపై బల్లి

భుజంపై బల్లి పడితే విజయానికి చిహ్నంగా భావించాలి. కుడి భుజంపై బల్లి పడితే పనుల్లో తిరుగులేని విజయాన్ని అందుకోబోతున్నారని అర్థం. శత్రువులపై గెలుపు, సమాజంలో పెరిగే పరపతిని కుడి భుజంపై బల్లి పడటం సూచిస్తుంది.

ఎడమ భుజంపై బల్లి పడితే మాత్రం మానసిక ఆందోళనను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వీపుపై బల్లి

వీపుపై బల్లి పడితే ఆర్ధిక లాభాలు. ఊహించని విధంగా పేరు ప్రఖ్యాతలు పొందుతారని దీనికి అర్థం.

కళ్లపై బల్లి

కళ్లపై బల్లి పడితే మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. కుడి కన్నుపై బల్లి పడితే ఆర్థిక లాభం కలుగుతుందని భావిస్తారు. ఆకస్మికంగా డబ్బు మీ చేతికి వస్తుందని అర్థం. ఎడమ కన్నుపై బల్లి పడితే ఆర్థిక నష్టం అని అర్థం చేసుకోవాలి. ఖర్చులు పెరగొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని బల్లి సూచిస్తుందని చెబుతారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More