ఈశాన్య దిశలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. చాలా సమస్యలకు అవకాశం ఇచ్చినట్టే!

ఈశాన్య దిశలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్య దిశ దేవతలకు నిలయం. ఇక్కడ పొరపాటున చేసే చిన్న తప్పులు కూడా మీ కుటుంబ ఆర్థిక స్థితిని, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ మూలలో ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసుకోండి. 

Published on: Apr 18, 2026, 15:00:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రతి దిశకూ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కానీ, అన్నింటికంటే పవిత్రమైనదిగా ‘ఈశాన్యం’. పురాణాల ప్రకారం, వాస్తు పురుషుని శిరస్సు ఈ దిశలోనే ఉంటుంది. అందుకే దీనిని ‘దేవ మూల’ అని పిలుస్తారు. ఈ మూల ఎంత ప్రశాంతంగా, శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో అంతటి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అయితే, చాలా మంది అవగాహన లేక ఈశాన్యంలో అనవసరమైన వస్తువులు పెట్టి వాస్తు దోషాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈశాన్య మూలలో పొరపాటున కూడా ఉండకూడని వస్తువులు ఏవో ఇప్పుడు చూద్దాం.

ఈశాన్య దిశలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి (pinterest)
ఈశాన్య దిశలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి (pinterest)

ఈశాన్య దిశలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

1.పాదరక్షలు, చెత్తబుట్టలు

ఈశాన్యం సాక్షాత్తు పరమేశ్వరుడికి, గంగా దేవికి నిలయం. అంతటి పవిత్రమైన చోట చెప్పుల స్టాండ్లు పెట్టడం లేదా చెత్తబుట్టలను ఉంచడం అంటే దైవశక్తిని అవమానించడమే. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించి, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రేకెత్తే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ స్వచ్ఛంగా, సువాసనభరితంగా ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

2.బరువైన వస్తువులు

చాలామంది స్థలం కలిసి వస్తుందని ఈశాన్యం మూలలో బరువైన అల్మారాలు, ఇనుప మంచాలు లేదా భారీ యంత్రాలను ఉంచుతుంటారు. వాస్తు నియమాల ప్రకారం ఇది పెద్ద తప్పు. ఈశాన్యం ఎప్పుడూ తేలికగా, ఖాళీగా ఉండాలి. ఇక్కడ బరువులు ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహం ఆగిపోతుంది. ఇది కేవలం ఆర్థిక ఇబ్బందులకే కాకుండా, పిల్లల ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతుంది.

3.విరిగిన విగ్రహాలు, పాత దేవుడి పటాలు తొలగించండి

ఈశాన్యంలో పూజా గది ఉండటం ఉత్తమం. కానీ, ఆ గదిలో విరిగిపోయిన దేవుడి విగ్రహాలు, చిరిగిపోయిన ఫోటోలు ఉండకుండా చూసుకోవాలి. పాతబడిన లేదా విరిగిన పటాలను ఇక్కడ ఉంచడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. మీరు ఏర్పాటు చేసుకున్న మందరంలో కేవలం శుభ్రమైన, కొత్తగా ఉండే విగ్రహాలు లేదా పటాలను మాత్రమే ఉంచండి.

ఈశాన్యాన్ని పాజిటివ్‌గా మార్చుకోండి ఎలా?

మీ ఇంట్లో ఈశాన్య మూల ఎప్పుడూ శక్తివంతంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

దిశలో గోడలకు లేత రంగులు వేయండి. ముదురు రంగులు ఈ దిశకు ఏమాత్రం పనికిరావు.

తగినంత వెలుతురు, గాలి వచ్చేలా కిటికీలు ఏర్పాటు చేసుకోండి.

ప్రతిరోజూ సాయంత్రం ఈశాన్యం మూలలో ఒక చిన్న దీపం లేదా అగరబత్తులు వెలిగించండి.

వీలైతే ఈ మూలలో ఒక పాత్రలో నీరు పోసి, అందులో కొన్ని పూలు ఉంచండి. ఇది సానుకూలతను రెట్టింపు చేస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఈశాన్యం మూలలో బరువులు ఉంటే ఏం జరుగుతుంది?

ఈశాన్యంలో బరువైన వస్తువులు ఉంచడం వల్ల ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి అడ్డుకోబడుతుంది. దీని వల్ల ఆర్థికంగా ఎదగలేకపోవడం, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

2. ఈశాన్యంలో టాయిలెట్ ఉంటే పరిష్కారం ఏమిటి?

వాస్తు ప్రకారం ఈశాన్యంలో టాయిలెట్ ఉండటం తీవ్రమైన దోషం. వీలైతే దానిని తొలగించడం ఉత్తమం. లేనిపక్షంలో వాస్తు నిపుణుల సలహాతో కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది.

3. ఈశాన్యం మూలలో ఏ మొక్కలు పెంచాలి?

ఈశాన్యంలో తులసి మొక్కను పెంచడం అత్యంత శుభప్రదం. అలాగే చిన్నపాటి పూల మొక్కలను కూడా పెంచవచ్చు, కానీ ముళ్ళతో ఉండే మొక్కలను అస్సలు ఉంచకూడదు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More