...
...
Next Story

శ్రావణ పౌర్ణమి: పాతవి వదిలి కొత్తదానికి స్వాగతం.. అంతరార్థం ఇదేనా? కొబ్బరికాయ పూజ నుంచి కొత్త జంధ్యం వరకు సంప్రదాయాలివే

శ్రావణ పూర్ణిమను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భిన్నమైన పేర్లు, సంప్రదాయాలతో జరుపుకుంటారు. 2026లో పూర్ణిమ తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28 ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది.

Published on: Aug 27, 2026, 11:00:52 IST
Advertisement

శ్రావణ మాసం అనగానే మనకు ముందుగా గుర్తువచ్చే పవిత్ర పండగ రక్షాబంధన్. అయితే శ్రావణ పూర్ణిమ ప్రాముఖ్యత కేవలం రాఖీ కట్టడంతోనే ముగిసిపోదు. దేశంలోని భిన్న ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని తమదైన సంప్రదాయాలు, ప్రత్యేక ఆచారాలతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 27న ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28 ఉదయం 9:48 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంత వైభవంగా జరుపుకుంటారో ఇప్పుడు పరిశీలిద్దాం.

సముద్ర తీరంలో నారలీ పూర్ణిమ సంబురం

శ్రావణ పౌర్ణమి: పాతవి వదిలి కొత్తదానికి స్వాగతం.. అంతరార్థం ఇదేనా? కొబ్బరికాయ పూజ నుంచి కొత్త జంధ్యం వరకు  సంప్రదాయాలివే
శ్రావణ పౌర్ణమి: పాతవి వదిలి కొత్తదానికి స్వాగతం.. అంతరార్థం ఇదేనా? కొబ్బరికాయ పూజ నుంచి కొత్త జంధ్యం వరకు సంప్రదాయాలివే

మహారాష్ట్ర, గోవా తదితర సముద్ర తీర ప్రాంతాల్లో శ్రావణ పూర్ణిమను 'నారలీ పూర్ణిమ'గా పిలుస్తారు. మత్స్యకార సమాజానికి చెందిన ప్రజలు ఈ ప్రత్యేకమైన రోజున సముద్ర దేవుడైన వరుణ భగవానుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వరుణుడికి కొబ్బరికాయ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సముద్రం ప్రశాంతంగా ఉండాలని, చేపల వేటకు వెళ్లే తమ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడాలని మత్స్యకారులు ఈ సందర్భంగా వేడుకుంటారు. కొత్త చేపల వేట సీజన్‌ను ఈ పూజతోనే ప్రారంభిస్తారు.

దక్షిణాదిలో అవని అవితమ్ విశిష్టత

ఇక దక్షిణ భారతదేశంలో ఈ పర్వదినాన్ని 'అవని అవితమ్' పేరుతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పవిత్ర దినాన బ్రాహ్మణులు తమ పాత యజ్ఞోపవీతాన్ని తొలగించి, కొత్త జనేవును ధరిస్తారు. దీనిని తెలుగు రాష్ట్రాల్లో జంధ్యాల పౌర్ణమి అని అంటారు. అంతేకాకుండా ఈ రోజును జ్ఞానానికి, వేద అధ్యయనానికి ప్రతీకగా భావిస్తారు. రుషుల తర్పణాలు వదిలి కొత్త సంవత్సర వేద పఠనాన్ని ప్రారంభిస్తారు.

మధ్య భారతదేశంలో కజరీ పూర్ణిమ

మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శ్రావణ పూర్ణిమను 'కజరీ పూర్ణిమ'గా పిలుస్తారు. ఇక్కడి రైతులు ఈ పండుగను వ్యవసాయం, పంటల సమృద్ధికి ముడిపెట్టి చూస్తారు. మంచి వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని కోరుకుంటూ రైతులు ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రాంతాలు మారినా, పేర్లు వేర్వేరుగా ఉన్నా.. అన్ని సంప్రదాయాలూ ఒకే ఒక సందేశాన్ని ఇస్తాయి. పాత జ్ఞాపకాలను, చేదు అనుభవాలను వెనక్కి నెట్టి జీవితంలో కొత్త అడుగులు వేయాలని ఈ పర్వదినం నేర్పుతుంది.

ఆత్మావలోకనానికి సరైన సమయం

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks