...
...
Next Story

సూర్య, శని కలయికతో నవపంచమ యోగం.. నేటి నుంచి ఈ 3 రాశుల వారికి ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 16న సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల శనితో నవపంచమ యోగం ఏర్పడనుంది. సూర్యుడు, శని గ్రహాల మధ్య శత్రుత్వ భావన ఉన్నప్పటికీ, ఈ యోగం కొన్ని రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

Published on: Nov 16, 2026, 12:30:40 IST
Advertisement

గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. ఈరోజు చాలా విశేషమైన యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల చాలా రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయి.

సూర్య, శని కలయికతో నవపంచమ యోగం.. నేటి నుంచి ఈ 3 రాశుల వారికి ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు! (AI)
సూర్య, శని కలయికతో నవపంచమ యోగం.. నేటి నుంచి ఈ 3 రాశుల వారికి ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు! (AI)

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకోవడం కారణంగా యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. అటువంటి యోగాల్లో ఒకటే నవపంచమ యోగం. ఈరోజు ఈ యోగం ఏర్పడింది. ఈరోజు సూర్యుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం వల్ల శని గ్రహంతో నవపంచమ యోగాన్ని ఏర్పరచాడు.

ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. సూర్యుడు, శని గ్రహాల మధ్య శత్రుత్వ భావన ఉన్నప్పటికీ, వీటి కలయిక నవపంచమ యోగాన్ని తీసుకొస్తుంది. ఇది శుభప్రదమైనది కూడా. 12 రాశుల వారిపై నవపంచమ యోగం ప్రభావం చూపించినప్పటికీ, మూడు రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

ఈరోజు నవపంచమ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం రెట్టింపు!

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి నవపంచమ రాజయోగం బాగా కలిసి రాబోతోంది. ఈ రాశి వారికి సూర్యుడి సంచారం, శనితో ఏర్పడే నవపంచమ యోగం శుభప్రదమైనది. ఈ సమయంలో ఈ రాశి వారి ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కార్యసాధన శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు ఈ సమయంలో విజయవంతంగా పూర్తవుతాయి. అంతేకాకుండా, వృశ్చిక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. అనేక విధాలుగా లాభాలను చూస్తారు.

కర్కాటక రాశి

మకర రాశి వారికి కూడా ఇది అద్భుతమైన సమయమని చెప్పొచ్చు. వారికి మంచి ఫలితాలను తీసుకొస్తుంది. కెరీర్, వ్యాపారాల్లో కొత్త అవకాశాలను చూస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం కూడా పెరుగుతుంది. కోరుకున్న ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. ఒప్పందాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సాధించడానికి ఇది అనుకూలమైన సమయం. మకర రాశి వారు చాలా కాలంగా న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, ఈ సమయంలో అనుకూల ఫలితాలను చూసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ యోగం ఈ రాశి వారికి కూడా అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది. భారీగా కలిసి వస్తుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks