గ్రహాలకు రాజు సూర్యుడు. ప్రతి నెల తన రాశిని మారుస్తూ ఉంటాడు. సూర్యుడు అధికారం, అహంకారం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, తండ్రి, నాయకత్వ లక్షణాలను సూచిస్తాడు. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు, కెరీర్‌లో సమస్యలు, గుర్తింపు లేకపోవడం వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే జాతకంలో సూర్యుడు స్థానం బలంగా ఉంటే విజయం, తేజస్సు, శక్తి, గుర్తింపు, కీర్తి వంటివి కలుగుతాయి.
సూర్య సంచారం

ప్రతి నెలా సూర్యుడు తన రాశిని మారుస్తూ ఉంటాడు. వచ్చే నెలలో, అంటే మార్చి నెలలో, సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడు తన రాశిని మార్చినప్పుడు దాన్ని సంక్రాంతి అంటారు. మకరంలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు అది మకర సంక్రాంతి అవుతుంది. మరి కొన్ని రోజుల్లో గురువు రాశి అయినటువంటి మీన రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు.
రెండిటి మధ్య స్నేహం ఉంటుంది. కాబట్టి ఇది కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకొస్తుంది. పైగా కొన్ని రాశుల వారు విపరీతమైన లాభాలను కూడా పొందబోతున్నారు. మరి మీన రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతుంది? ఆ అదృష్ట రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీన రాశిలోకి సూర్యుడు ప్రవేశం.. ఈ రాశుల వారికి భారీగా లాభాలు:
మీన రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు భారీ లాభాలను పొందబోతున్నారు. వృషభ రాశి, మిథున రాశి, ధనుస్సు రాశి, కుంభ రాశి, మీన రాశి వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశుల వారి ఆదాయం కూడా పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అలాగే కెరీర్‌లో కూడా మంచి మార్పులు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా భారీగా లాభాలు కలుగుతాయి.
ఈ రాశుల వారికి సూర్య సంచారంతో నష్టాలు:
సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి నష్టాలు కలగబోతున్నాయి. కర్కాటక రాశి, కన్యా రాశి, తులా రాశి వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరంగా కూడా సమస్యలు రావచ్చు. బడ్జెట్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విధాలుగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
ఈ సమయంలో ఎలాంటి పరిహారాలను పాటించాలి:
- ఏదైనా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ సమయంలో త్వరగా నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించాలి.
- సూర్యుడికి రాగి పాత్రలో నీళ్లు పోసి అర్ఘ్యం సమర్పించడం మంచిది.
- ఇలా చేయడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అడ్డంకులు తొలగిపోతాయి, కెరీర్‌లో కూడా మంచి మార్పులను చూడవచ్చు.