Sun Transit: మీన రాశిలోకి సూర్య సంచారం, 12 రాశులపై ప్రభావం.. ఏ రాశులకు లాభాలు, ఎవరికి నష్టాలో తెలుసుకోండి!

సూర్యుడు బలహీనంగా ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు, కెరీర్‌లో సమస్యలు, గుర్తింపు లేకపోవడం వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాతకంలో సూర్యుడు స్థానం బలంగా ఉంటే విజయం, తేజస్సు, శక్తి, గుర్తింపు, కీర్తి వంటివి కలుగుతాయి. మీన రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఏ రాశుల వారికి కలిసి రాబోతుంది? 

Published on: Feb 26, 2026, 13:30:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలకు రాజు సూర్యుడు. ప్రతి నెల తన రాశిని మారుస్తూ ఉంటాడు. సూర్యుడు అధికారం, అహంకారం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, తండ్రి, నాయకత్వ లక్షణాలను సూచిస్తాడు. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు, కెరీర్‌లో సమస్యలు, గుర్తింపు లేకపోవడం వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే జాతకంలో సూర్యుడు స్థానం బలంగా ఉంటే విజయం, తేజస్సు, శక్తి, గుర్తింపు, కీర్తి వంటివి కలుగుతాయి.

మీన రాశిలోకి సూర్యుడు ప్రవేశం.. ఈ రాశుల వారికి భారీగా లాభాలు (pinterest)
మీన రాశిలోకి సూర్యుడు ప్రవేశం.. ఈ రాశుల వారికి భారీగా లాభాలు (pinterest)

సూర్య సంచారం

ప్రతి నెలా సూర్యుడు తన రాశిని మారుస్తూ ఉంటాడు. వచ్చే నెలలో, అంటే మార్చి నెలలో, సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడు తన రాశిని మార్చినప్పుడు దాన్ని సంక్రాంతి అంటారు. మకరంలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు అది మకర సంక్రాంతి అవుతుంది. మరి కొన్ని రోజుల్లో గురువు రాశి అయినటువంటి మీన రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు.

రెండిటి మధ్య స్నేహం ఉంటుంది. కాబట్టి ఇది కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకొస్తుంది. పైగా కొన్ని రాశుల వారు విపరీతమైన లాభాలను కూడా పొందబోతున్నారు. మరి మీన రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతుంది? ఆ అదృష్ట రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీన రాశిలోకి సూర్యుడు ప్రవేశం.. ఈ రాశుల వారికి భారీగా లాభాలు:

మీన రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు భారీ లాభాలను పొందబోతున్నారు. వృషభ రాశి, మిథున రాశి, ధనుస్సు రాశి, కుంభ రాశి, మీన రాశి వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశుల వారి ఆదాయం కూడా పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అలాగే కెరీర్‌లో కూడా మంచి మార్పులు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా భారీగా లాభాలు కలుగుతాయి.

ఈ రాశుల వారికి సూర్య సంచారంతో నష్టాలు:

సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి నష్టాలు కలగబోతున్నాయి. కర్కాటక రాశి, కన్యా రాశి, తులా రాశి వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరంగా కూడా సమస్యలు రావచ్చు. బడ్జెట్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విధాలుగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

ఈ సమయంలో ఎలాంటి పరిహారాలను పాటించాలి:

  • ఏదైనా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ సమయంలో త్వరగా నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించాలి.
  • సూర్యుడికి రాగి పాత్రలో నీళ్లు పోసి అర్ఘ్యం సమర్పించడం మంచిది.
  • ఇలా చేయడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అడ్డంకులు తొలగిపోతాయి, కెరీర్‌లో కూడా మంచి మార్పులను చూడవచ్చు.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More