వృశ్చిక రాశిలోకి సూర్యుడు - నెలపాటు ఈ 6 రాశుల వారికి ధనయోగం, కెరీర్‌లో తిరుగులేని విజయం!

నవంబర్ 16, 2026వ తేదీన  సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. డిసెంబర్ 16 వరకు కొనసాగే ఈ సంచారం వల్ల మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారికి ఆర్థిక, కెరీర్ రంగాల్లో అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి.

Published on: Nov 16, 2026, 08:40:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

గ్రహాల రారాజు సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఇలా ద్వాదశ రాశుల చుట్టూ ఒకసారి ప్రదక్షిణ పూర్తి చేయడానికి సూర్యుడికి ఏడాది సమయం పడుతుంది. తాజాగా సోమవారం…. నవంబర్ 16, 2026న సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. సరిగ్గా ఏడాది విరామం తర్వాత సూర్యుడు తిరిగి ఈ రాశిలోకి అడుగుపెట్టడం విశేషం. వచ్చే నెల అంటే డిసెంబర్ 16, 2026 వరకు సూర్యుడు వృశ్చిక రాశిలోనే సంచరిస్తాడు.

వృశ్చిక రాశిలోకి సూర్యుడు
వృశ్చిక రాశిలోకి సూర్యుడు

వృశ్చిక రాశికి అధిపతి కుజుడు (అంగారకుడు). జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, కుజుడి మధ్య అత్యంత గాఢమైన స్నేహ బంధం ఉంది. సూర్యుడిని ధైర్యం, శక్తి, పితృత్వం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా చెబుతారు. మరోవైపు కుజుడు భూమి, రక్తం, పరాక్రమం, ధైర్యానికి కారకుడు. ఈ రెండు మిత్ర గ్రహాల కలయిక జరిగినప్పుడు వాటి ప్రభావం రెట్టింపు అవుతుంది.

వృశ్చిక రాశి సంచార కాలంలో సూర్యుడిపై కుజుడి ప్రభావం బలంగా ఉండి, మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష్య గణనల ప్రకారం…. ఈ నెల రోజుల కాలం ఆరు రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన సానుకూల మార్పులను తీసుకురానుంది. సంపద, కెరీర్ పరంగా వారికి కలిసిరానున్న అంశాలేంటో ఇప్పుడు చూద్దాం….

మిథున రాశి:

సూర్యుడు మిథున రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కాలంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అద్భుత విజయాలు సాధిస్తారు. అయితే పని ప్రదేశంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు, ఆచితూచి అడుగువేయండి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి, కానీ భారీ రుణ లావాదేవీలకు దూరంగా ఉండటం మేలు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దు. మీ చుట్టూ ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడండి. ఈ సమయంలో గణేశుడిని ఆరాధించడం వల్ల విశేష ఫలితాలు దక్కుతాయి.

కర్కాటక రాశి:

కర్కాటక రాశికి ఐదవ ఇంట్లో సూర్యుడి సంచారం సాగుతోంది. దీనివల్ల గత కొంతకాలంగా వేధిస్తున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కుదిరి, పెళ్లి ఖాయమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే, పూర్తిస్థాయిలో పరిశోధన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నీటిలో కాస్త గంగాజలం కలిపి విష్ణుమూర్తికి అభిషేకం చేయడం మీకు శుభప్రదం.

సింహ రాశి:

సింహ రాశికి అధిపతి సూర్యుడే కావడం విశేషం. ప్రస్తుతం సూర్యుడు ఈ రాశికి నాల్గవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఫలితంగా కార్యాలయంలో ఎదురవుతున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారులు తమ పనులను వేగంగా పూర్తి చేయగలుగుతారు.

మీ సానుకూల ఆలోచనలు ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి, కుటుంబానికి తగిన సమయం కేటాయించండి. ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఈ కాలంలో ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి పొదుపు పాటించండి. సమస్యల నుంచి బయటపడేందుకు మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రతిరోజూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మేలు జరుగుతుంది.

వృశ్చిక రాశి:

సూర్యుడు స్వయంగా వృశ్చిక రాశిలోనే సంచరిస్తున్నాడు. దీనివల్ల మీ పని సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీలో ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతుంది. ఉద్యోగం, వృత్తి రంగాల్లో మీ స్థానం మరింత బలపడుతుంది. ఏవైనా కారణాలతో మీ పదోన్నతి (ప్రమోషన్) నిలిచిపోయి ఉంటే, ఇప్పుడు గట్టిగా ప్రయత్నించండి… తప్పకుండా విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాల బాట పడతారు. కుటుంబ సంబంధాలు దృఢంగా మారుతాయి. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి రెండూ అనుకూలంగా ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి:

కుంభ రాశికి పదవ స్థానంలో సూర్యుడి సంచారం జరుగుతోంది. ఇది మీకు లాభాలను, పురోగతిని తెచ్చిపెట్టే అద్భుత సమయం. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతో రాణిస్తారు. కెరీర్‌లో ముందుకు సాగడానికి విలువైన అవకాశాలు తలుపు తడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. ఇల్లు, కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించండి, బంధాలను కాపాడుకోండి. అహంకారానికి ఏమాత్రం తావివ్వకండి. ప్రతిరోజూ పరమశివుడికి జలాభిషేకం చేయడం మీకు ఎంతో ప్రయోజనకరం.

మీన రాశి:

మీన రాశికి తొమ్మిదవ స్థానమైన భాగ్య స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. దీనివల్ల మీకు అదృష్టం పూర్తిగా కలిసివస్తుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు డబ్బును పొదుపు చేయగలుగుతారు. కుటుంబంలోని పెద్దలు, శ్రేయోభిలాషుల సలహాలు తీసుకుని పనులు చేయడం వల్ల విజయం వరిస్తుంది. కెరీర్‌లో ఆశించిన పురోగతి ఉంటుంది. కార్యాలయంలో ఒక ముఖ్యమైన పదవి లేదా కీలక బాధ్యతలు మీకు దక్కే అవకాశం ఉంది. ప్రతిరోజూ 'ఓం నమో భగవతే వాసుదేవాయ నమః' అనే మంత్రాన్ని జపించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More