Sun Transit Taurus 2026: ఖగోళ మార్పుల్లో అత్యంత కీలకమైన 'సూర్య సంచారం' మే 15వ తేదీ ఉదయం జరగనుంది. గ్రహాలకు రాజుగా భావించే సూర్య భగవానుడు మేష రాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం… సూర్యుడు ఆత్మవిశ్వాసం, అధికారం, ఉద్యోగం, విజయానికి కారకుడు. వృషభ రాశిలోకి సూర్యుడి ప్రవేశం వల్ల సమాజంలో వ్యక్తుల దృష్టి ప్రధానంగా ఆర్థికాభివృద్ధి, కుటుంబ సంక్షేమం మరియు భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్రీకృతమవుతుంది. ఈ కాలంలో ప్రజలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా…. ఆచితూచి అడుగులు వేయడానికి మొగ్గు చూపుతారు. ముఖ్యంగా ఆరు రాశుల వారికి ఈ సంచారం రాజయోగంలా మారబోతోంది.
ఏ రాశికి ఎలా ఉండబోతోంది…?
- మేష రాశి : ఆర్థిక పరంగా మేష రాశి వారికి ఇది స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆదాయం పెరగడమే కాకుండా…. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభాల పంట పండుతుంది.
- వృషభ రాశి : సూర్యుడు మీ స్వంత రాశిలోకి వస్తున్నందున…. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శుభవార్తలు అందుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.
- కర్కాటక రాశి : కెరీర్ పరంగా ఎదురుచూస్తున్న ఉపశమనం లభిస్తుంది. మీ కష్టాన్ని సీనియర్లు గుర్తిస్తారు. పదోన్నతి (ప్రమోషన్) పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
- సింహ రాశి : సూర్య సంచారం మీకు అత్యంత కీలకం కానుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు సాఫీగా సాగుతాయి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాల ద్వారా భారీ లాభాలు చేకూరే అవకాశం ఉంది.
- కన్య రాశి : వ్యాపార లావాదేవీలకు ఈ సమయం చాలా బాగుంది. వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, మార్కెట్లో మీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకోవడానికి ఇది సరైన సమయం.
- ధనుస్సు రాశి : కెరీర్ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. కొత్త అవకాశాల కోసం చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. కుటుంబ వ్యాపారాలు చేసే వారికి లాభాలు పెరుగుతాయి. చాలా కాలంగా వాహనం కొనాలనుకునే వారి కల ఈ సమయంలో నెరవేరవచ్చు.
{{^htLoading}} {{/htLoading}}
ఈ గ్రహ సంచార సమయంలో పెట్టుబడులు, పొదుపు విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}