Lucky Zodiac signs: సంపదను ఆకర్షించే అదృష్ట రాశులు ఇవే.. నిరంతర ధనయోగం!

Lucky Zodiac signs: నేటి యాంత్రిక జీవనంలో విశ్రాంతిని కూడా పణంగా పెట్టి డబ్బు సంపాదనలో బిజీగా ఉంటున్నాం. కొందరికి అదృష్టం కలిసి రాక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుంటారు. కొందరిని అదృష్టం నీడలా వెన్నాడుతుంది. 12 రాశుల్లో కొన్ని రాశులపై మహాలక్ష్మి అనుగ్రహం మెండుగా ఉంటుంది. 

Published on: May 11, 2026, 16:00:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మనకి మొత్తం 12 రాశులు. రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ రాశుల వారు మాత్రం ఎంతో అదృష్టవంతులనే చెప్పొచ్చు. ఎల్లప్పుడూ ఈ రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది.

Lucky Zodiac signs: సంపదను ఆకర్షించే అదృష్ట రాశులు ఇవే.. నిరంతర ధనయోగం! (pinterest)
Lucky Zodiac signs: సంపదను ఆకర్షించే అదృష్ట రాశులు ఇవే.. నిరంతర ధనయోగం! (pinterest)

ప్రతి ఒక్కరూ కూడా డబ్బు కోసమే కష్టపడుతూ ఉంటారు. విశ్రాంతి తీసుకోవడం కూడా మర్చిపోయి అనుక్షణం ఉరుకులు పరుగులతో జీవిస్తూ ఉంటారు. కానీ ఈ రాశుల వారిని మాత్రం డబ్బే వెతుక్కుంటూ వస్తుంది. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

అదృష్టం అంటే ఈ రాశులదే.. ఎప్పుడూ వీరితోనే డబ్బు ఉంటుంది.

1.మిధున రాశి

మిధున రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. ఈ రాశి వారికి మహాలక్ష్మి అనుగ్రహం ఎప్పుడూ ఉండడంతో డబ్బుకి లోటు ఉండదు. విజయాలను, గౌరవాన్ని కూడా పొందుతారు. ఎప్పుడూ కష్టపడి పనిచేస్తారు. దాంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వీరి కష్టాన్ని చూసే లక్ష్మీదేవి వీరితో నిత్యం ఉండడానికి ఇష్టపడుతుంది.

2.వృషభ రాశి

వృషభ రాశి వారు కూడా ఎప్పుడూ డబ్బుతో ఉంటారు. వృషభ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. డబ్బుకి లోటు ఉండదు. కష్టపడి పనిచేస్తారు. చాలా తెలివైన వారు కూడా. దీంతో జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషానికి కూడా కొదవ ఉండదు.

3.సింహ రాశి

సింహ రాశి వారు పుట్టుకతోనే అదృష్టవంతులని చెప్పాలి. ఈ రాశి వారికి ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులే ఉండవు. జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలరు. సంతోషంగా ఉంటారు. ఇతరులను సంతోషంగా ఉంచడానికి కూడా ఈ రాశి వారు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు.

4.కర్కాటక రాశి

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. లక్ష్మీదేవి ఆశీస్సులు వీరిపై ఎప్పుడూ ఉంటాయి. ఈ రాశి వారు డబ్బుతో ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు. ఎలాంటి కష్టాన్నైనా సరే ఎదుర్కొంటారు.

5.తులా రాశి

తులా రాశి వారు ఎప్పుడూ గౌరవ మర్యాదలను పొందుతారు. ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలరు. విలాసవంతమైన జీవితాన్ని ఈ రాశి వారు ఇష్టపడతారు. సంతోషంగా ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడంతో దేనికి లోటు ఉండదు. విజయాలను కూడా అందుకుంటారు.

6.మీన రాశి

రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కృషిని నమ్ముకుంటారు. విజయాలను అందుకుంటారు. అదృష్టం కూడా వీరితోనే ఉంటుంది. కలలు నెరవేరడానికి కృషి చేస్తూ ఉంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More