Mars Transit 2026 : మేషరాశిలోకి అంగారకుడు - మే 11 నుంచి ఈ 4 రాశుల వారికి కష్టాలు, 41 రోజులు జాగ్రత్త..!

Mars transit Aries 2026 : మే 11న కుజుడు (అంగారకుడు) మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. జూన్ 21 వరకు కొనసాగే ఈ సంచారంతో కర్కాటక, తుల, మకర, మీన రాశుల వారు ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published on: May 10, 2026, 17:10:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mars transit Aries 2026 : జ్యోతిష్య దృక్కోణం నుంచి మే నెల అత్యంత కీలకమైన మార్పులకు వేదిక కాబోతోంది. నవగ్రహాలలో 'సేనాధిపతి'గా, అత్యంత శక్తివంతుడైన గ్రహంగా భావించే అంగారకుడు (కుజుడు) మే 11న తన స్వరాశి అయిన మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జూన్ 21 వరకు అంటే దాదాపు 41 రోజుల పాటు అంగారకుడు ఇదే రాశిలో ఉంటాడు.

మేషరాశిలోకి అంగారకుడు: మే 11 నుంచి ఈ 4 రాశుల వారికి కష్టాలు
మేషరాశిలోకి అంగారకుడు: మే 11 నుంచి ఈ 4 రాశుల వారికి కష్టాలు

నిప్పు కణికలాంటి అంగారకుడు తన సొంత రాశిలోకి వచ్చినప్పుడు అతని శక్తి రెట్టింపు అవుతుంది. అయితే…. ఈ శక్తి అందరికీ సానుకూల ఫలితాలను ఇవ్వదు. ముఖ్యంగా నాలుగు రాశుల వారిపై ఈ సంచార ప్రభావం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య గణాంకాలు చెబుతున్నాయి.

ఈ 4 రాశులపై ప్రతికూల ప్రభావం:

  1. కర్కాటక రాశి : ఈ రాశి వారికి మే 11 నుండి జూన్ 21 వరకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా కార్యాలయాల్లో సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. చిన్నపాటి వాగ్వాదం కూడా మీ ఉద్యోగానికి లేదా పై అధికారులతో ఉన్న సంబంధాలకు ముప్పు తెచ్చిపెట్టవచ్చు. అనవసరమైన ఆలోచనలతో ప్రశాంతతను పాడుచేసుకోకుండా ఉండటం ఉత్తమం.
  2. తులా రాశి : శుక్రుడు అధిపతిగా ఉన్న తులా రాశి వారికి ఈ సమయంలో వ్యక్తిగత బంధాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు భాగస్వామ్య ఒప్పందాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలలో స్పష్టత లేకపోతే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
  3. మకర రాశి : శని దేవుడి రాశి అయిన మకర రాశి వారు ఈ 41 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తత అవసరం, లేనిపక్షంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆస్తి తగాదాలు తలెత్తవచ్చు. అనవసర ఖర్చులను నియంత్రించుకోకపోతే ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం ఉంది. కుటుంబంలో గందరగోళ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
  4. మీన రాశి : బృహస్పతి రాశి అయిన మీన రాశి వారు పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ఈ సమయంలో షేర్ మార్కెట్ లేదా ఇతర వ్యాపారాల్లో పెట్టే పెట్టుబడులు నష్టాలను మిగిల్చవచ్చు. మీ మాట తీరు వల్ల ఇతరుల మనసు గాయపడే అవకాశం ఉంది… కాబట్టి సంభాషణలో సంయమనం పాటించండి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు.

అంగారక దోష నివారణ మార్గాలు:

పైన పేర్కొన్న రాశుల వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. కొన్ని ఆధ్యాత్మిక నివారణల ద్వారా అంగారకుడి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు…

  • జూన్ 21 వరకు ప్రతిరోజూ హనుమంతుడిని ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ధైర్యం, శాంతి లభిస్తాయి.
  • మంగళవారం నాడు ఎరుపు రంగు వస్తువులను (కందిపప్పు, ఎర్రటి వస్త్రాలు) పేదలకు దానం చేయండి.
  • ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More