సూర్యుడి నక్షత్ర సంచారంలో మార్పు, ఐదు రాశులకు గోల్డెన్ డేస్!
సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. సూర్యుడు కాలనుగుణంగా తన రాశులతో పాటు నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు. ఫిబ్రవరి 6న సూర్యుడు ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులను తీసుకువస్తుంది. గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి.

సూర్యుడు కాలనుగుణంగా తన రాశులతో పాటు నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు. ఫిబ్రవరి 6న సూర్యుడు ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఏ లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.
ధనిష్ట నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి అనేక లాభాలు
మేషరాశి:
మేష రాశి వారికి సూర్యుని నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పని ప్రదేశంలో మంచి మార్పులను చూస్తారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా కూడా సమస్యలన్నీ తొలగిపోతాయి.
సింహ రాశి:
సింహ రాశి వారికి సూర్య సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. శత్రువుల నుంచి కూడా విజయాన్ని సాధిస్తారు. పెద్ద వ్యాపారాలను విజయవంతంగా చేస్తారు. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. గొడవలు తొలగిపోతాయి. పూర్వికుల నుంచి ఆస్తులను పొందుతారు.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి కూడా సూర్య నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. ఇన్వెస్ట్మెంట్ చూస్తే బాగా కలిసి వస్తుంది. కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం ఉంది.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి సూర్య సంచారం బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా సమస్యలు తొలగిపోతాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా ఇది శుభసమయం. విద్యార్థులు ఉన్నత చదువుకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి ధనిష్ట నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు మానసిక సమస్యల నుంచి బయటపడతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. రిలేషన్‌షిప్‌లో కూడా ఆనందం ఉంటుంది. సక్సెస్‌ను అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులను చేపడతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


