...
...
Next Story

Sunday Remedies: ఆదివారం ఈ చిన్న పరిహారాలు చేస్తే.. సూర్య భగవానుని కృపతో కష్టాలన్నీ దూరం!

హిందూ సంప్రదాయంలో ఆదివారం సూర్యభగవానుడికి అంకితమైన పవిత్రమైన రోజుగా భావిస్తారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే కీర్తి, ప్రభుత్వ ఉద్యోగ యోగం, ఉన్నతమైన కెరీర్ వంటి శుభఫలితాలు లభిస్తాయని చెబుతారు.

Published on: Aug 29, 2026, 14:00:57 IST
Advertisement

మన సనాతన సంప్రదాయాల్లో ప్రతి రోజుకి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో ఆదివారం సూర్యభగవానుడిని ప్రత్యేకించి ఆరాధిస్తాము. ఆదివారాన్ని చాలా విశేషమైన రోజుగా చెప్తారు. జ్యోతిష్య శాస్త్రాన్ని చూసినట్లయితే, జాతకంలో సూర్య బలం బాగుంటే ఆ వ్యక్తి జీవితం కూడా బాగున్నట్టే. ఆ వ్యక్తి జీవితంలో అఖండ కీర్తి, ప్రభుత్వ ఉద్యోగ యోగం, ఉన్నతమైన కెరీర్ లభిస్తాయి.

Sunday Remedies: ఆదివారం ఈ చిన్న పరిహారాలు చేస్తే.. సూర్య భగవానుని కృపతో కష్టాలన్నీ దూరం! (AI)
Sunday Remedies: ఆదివారం ఈ చిన్న పరిహారాలు చేస్తే.. సూర్య భగవానుని కృపతో కష్టాలన్నీ దూరం! (AI)

జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే ఎంత కష్ట పడినా కూడా గుర్తింపు రాదు. అనారోగ్య సమస్యలు, ఇలా రకరకాల దోషాలతో బాధ పడాల్సి ఉంటుంది. సూర్యుని పరిపూర్ణ అనుగ్రహం పొందాలంటే ఆదివారం కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించండి. దాంతో చాలా రకాల లాభాలు పొందవచ్చు.

సూర్యోదయం వేళ అర్ఘ్యం ప్రధానం

ఆదివారం నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత రాగి పాత్రలో నీళ్లు తీసుకుని, ఎర్రటి పూలను వేసి, కుంకుమ, అక్షంతలను కూడా అందులో వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. “ఓం సూర్యాయ నమః” అనే మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించాలి. ఇలా చేస్తే సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఆత్మవిశ్వాసం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

దీపారాధన

సూర్య భగవానుని కటాక్షం కలగాలంటే ఆదివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవు నెయ్యితో దీపాలను వెలిగించండి. దుష్టశక్తులు రావు. సిరిసంపదలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఎదురవుతున్న అడ్డంకుల నుంచి కూడా బయటపడవచ్చు.

దాన ధర్మాలు

హిందూ ధర్మంలో ఆదివారం సూర్య భగవానునికి అంకితం చేయబడింది. ఈ పవిత్ర రోజున కొన్ని ప్రత్యేక నివారణ చర్యలు పాటించడం ద్వారా కెరీర్‌లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks