...
...
Next Story

స్వప్నశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున ఈ కలలు వస్తే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు.. కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!

బ్రహ్మ ముహూర్తం సమయంలో కొన్ని కలలు వస్తే మాత్రం అదృష్టవంతులని చెప్పచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తాన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య ఉంటుంది. ఈ సమయంలో వచ్చిన కలలు నెరవేరుతాయని అంటారు.

Published on: Jan 26, 2026, 12:00:14 IST
Advertisement

మనము నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని కలలు అసలు మనకు గుర్తు ఉండవు. కొన్ని కలలు వచ్చినట్లయితే, అవి శుభ ఫలితంగా భావించాలి. బ్రహ్మ ముహూర్తంలో ఈ కలలు వస్తే మాత్రం చాలా మంచి జరుగుతుందని అంటారు.

బ్రహ్మ ముహూర్తం సమయంలో కలలు

స్వప్నశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున ఈ కలలు వస్తే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు
స్వప్నశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున ఈ కలలు వస్తే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు

బ్రహ్మ ముహూర్తం సమయంలో కొన్ని కలలు వస్తే మాత్రం అదృష్టవంతులని చెప్పచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్తాన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య ఉంటుంది. ఈ సమయంలో వచ్చిన కలలు నెరవేరుతాయని అంటారు.

బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి కలలు వచ్చినట్లయితే మంచి జరగబోతోందని, అదృష్టం కలిసి రాబోతోందని, అనేక మార్పులు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని అర్థం చేసుకోవాలి. తెల్లవారుజామున ఈ వస్తువులు కలలో కనపడితే మాత్రం కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది.

తెల్లవారుజామున ఇవి కలలోకి వస్తే మీరు చాలా లక్కీ

1.ధాన్యం

బ్రహ్మ ముహూర్తంలో ధాన్యం కుప్ప కనిపిస్తే మీరు చాలా అదృష్టవంతులని అర్థం చేసుకోవాలి. ఈ కల చాలా శుభప్రదమైనది. భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని, అనేక విధాలుగా మీరు లాభాలను పొందుతారని అర్థం చేసుకోవాలి. ఈ కల వస్తే మాత్రం అనేక లాభాలు కలుగుతాయని భావించాలి.

2.నదిలో స్నానం

స్వప్న శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, బ్రహ్మ ముహూర్తం సమయంలో నదిలో స్నానం చేసినట్లు కల వచ్చినట్లయితే అది చాలా మంచిది. ఈ కల వచ్చినట్లయితే రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుందని అర్థం. అలాగే ఇంతకుముందు ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే, దానిలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయని అర్థం చేసుకోవాలి.

3.ఊడిపోయిన దంతాలు

బ్రహ్మ ముహూర్తంలో కలలో నీటి కొలను లేదా నీటి తొట్టె వంటివి కనపడితే కూడా మంచి జరగబోతోందని అర్థం. ఇలాంటి కలలు వచ్చినట్లయితే ఆర్థిక లాభం కలుగుతుంది. ఆస్తి లాభం కూడా పొందవచ్చని అర్థం చేసుకోవాలి.

5.నవ్వుతున్న చిన్నారి

బ్రహ్మ ముహూర్తం సమయంలో ఒక శిశువు లేదా చిన్నారి నవ్వుతున్నట్లు కలలో కనపడినట్లయితే చాలా శుభప్రదమైనదిగా భావించాలి. ఇలాంటి కలలు వచ్చినట్లయితే మీకు గోల్డెన్ డేస్ ప్రారంభమవుతున్నాయని, లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కల వస్తే సంపద కూడా పెరుగుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe