ఈ రాశులకు శుభ దినాలు జనవరి 23 నుంచి ప్రారంభమవుతాయి, బుధుడు 2 సార్లు సంచారంతో గోల్డెన్ డేస్!
హిందూ క్యాలెండర్ ప్రకారం చూస్తే, బుధుని నక్షత్ర సంచారం జనవరి 23న జరుగబోతోంది. జనవరి 23న బుధుని సంచారంలో మార్పు రానుంది. అలాగే చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి కూడా ప్రవేశించబోతున్నాడు. బుధుని సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కల్పించబోతోంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు?
గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులు తీసుకొస్తుంది. కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని సందర్భాల్లో అశుభ ఫలితాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బుధుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహాల యువరాజు బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కుంభ రాశి అధిపతి శని. బుధుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

బుధ సంచారం
హిందూ క్యాలెండర్ ప్రకారం చూస్తే, బుధుని నక్షత్ర సంచారం జనవరి 23న జరుగబోతోంది. జనవరి 23న బుధుని సంచారంలో మార్పు రానుంది. అలాగే చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి కూడా ప్రవేశించబోతున్నాడు. బుధుని సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కల్పించబోతోంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారు బుధ సంచారంతో లాభాలను పొందబోతున్నారు? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రవణ నక్షత్రం, కుంభ రాశిలో బుధుని సంచారం.. ఈ రాశులకు అనేక లాభాలు
జనవరి 23 నుంచి కొన్ని రాశుల వారికి శుభదినాలు ప్రారంభం కాబోతున్నాయి. బుధుడు రెండు సార్లు తన సంచారంలో మార్పు చేయబోతున్నాడు. మొదట కుంభ రాశిలోకి ప్రవేశించడం, ఆ తర్వాత శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించడం. ఈ రెండు మార్పులు కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను తీసుకురానున్నాయి. మరి ఆ అదృష్ట రాశుల గురించి ఇప్పుడు చూద్దాం.
మేష రాశి
మేష రాశి వారికి ఇది శుభప్రదమైన సమయం. కుంభ రాశిలో బుధుని సంచారం, శ్రవణ నక్షత్రంలో బుధుడి ప్రవేశం మీ రాశి వారికి బాగా కలిసి రాబోతోంది. సంతోషంగా ఉంటారు. కెరీర్‌లో ప్రతి లక్ష్యాన్ని పూర్తిచేస్తారు. పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఊహించని విధంగా ఆర్థిక లాభాలను పొందుతారు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు కూడా ఇది శుభ సమయం. సంపద పెరుగుతుంది. ప్రయాణ అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామి పట్ల శ్రద్ధ వహించాలి. మొత్తం మీద బుధ సంచారం ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది.
మకర రాశి
మకర రాశి వారికి కుంభ రాశిలో బుధుని సంచారం బాగా కలిసి రాబోతోంది. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. పెట్టుబడులు పెడితే కూడా బాగా కలిసి వస్తాయి. వ్యాపారంలో దూసుకుపోతారు. అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


