...
...
Next Story

కలలో పూర్వీకులు కనిపిస్తున్నారా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?

స్వప్న శాస్త్రం ప్రకారం పూర్వీకులు కలలో కనిపించడం అనేది వారు ఎలాంటి స్థితిలో కనిపించారు, ఏమి చేశారు, ఏమి మాట్లాడారు అనే అంశాలపై ఆధారపడి వివిధ రకాలుగా భావిస్తారు. పూర్వీకులు ప్రశాంతంగా లేదా సంతోషంగా కనిపించడం ఆశీర్వాదానికి, శుభ పరిణామాలకు సంకేతంగా భావిస్తారు.

Published on: Sep 30, 2026, 16:00:44 IST
Advertisement

స్వప్న శాస్త్రం ప్రకారం పూర్వీకులు కలలో కనపడితే మంచిదేనా: ప్రతి ఒక్కరికి నిద్రపోయేటప్పుడు కలలు రావడం సహజమే. అయితే కొన్ని కలలు మంచి ఫలితాలను, కొన్ని కలలు సమస్యలను తీసుకొస్తాయి. కొన్ని కలలు శుభం అయితే, కొన్ని అశుభమైనవి. రాత్రి నిద్రపోయేటప్పుడు పూర్వీకులు కలలో కనపడితే మంచిదా? కాదా? పూర్వీకులు కలలో కనపడితే దానిని ఎలా భావించాలి? పూర్వీకులు కలలో ఎలా కనిపించారు? వాటి ఆధారంగా జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం ప్రకారం పూర్వీకులు కలలో కనపడితే మంచిదేనా?

కలలో పూర్వీకులు కనిపిస్తున్నారా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది? (AI)
కలలో పూర్వీకులు కనిపిస్తున్నారా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది? (AI)

స్వప్న శాస్త్రంలో పూర్వీకులకు సంబంధించిన కలలను ప్రత్యేకమైనవిగా చెప్తారు. కలలో పూర్వీకులు ఏ స్థితిలో కనిపించారు, దాని ఆధారంగా ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో తెలుసుకో వచ్చు. ఇలాంటి కలలు శుభమైనవిగా లేదా అశుభమైనవిగా ఉండొచ్చు.

కలలో పూర్వీకులు వివిధ స్థితుల్లో కనపడితే

ప్రశాంతంగా లేదా సంతోషంగా కలలో పూర్వీకులు కనపడటం:

కలలో పూర్వీకులు ప్రశాంతంగా లేదా సంతోషంగా కనపడినట్లైతే శుభసూచికంగా భావించాలి. మతపరమైన విశ్వాసాల ప్రకారం చూసుకున్నట్లయితే, ఇలాంటి కలలు పూర్వీకుల ఆశీర్వాదానికి సంకేతం. కుటుంబంలో సంతోషం, శాంతి పెరుగుతాయి. సానుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది.

తలపై చేయి వేసి ఆశీర్వదించడం:

కలలో పూర్వీకులు తలపై చేయి వేసి ఆశీర్వదిస్తున్నట్లు కనపడినట్లయితే శుభ ఫలితాలను పొందవచ్చు. ఆప్యాయత, ఆశీర్వాదాలకు ఇది సంకేతం. కష్టకాలంలో ధైర్యం లభించడం, పూర్వీకుల రక్షణ ఉంటుందని సూచనగా కొందరికి ఇలాంటి కలలు వస్తాయి.

పూర్వీకులు కోపంతో కనిపించడం:

కలలో పూర్వీకులు ఏడుస్తూ ఉండడం లేదా బాధగా, కోపంగా కనిపించినట్లయితే ఆందోళన, సమస్యలు లేదా ఇబ్బందులకు సంకేతంగా భావించాలి. ఇలాంటి కలలు వచ్చినప్పుడు పూర్వీకులను స్మరించుకోవాలి. వారి పేరుతో దానధర్మాలు చేయడం, భక్తిశ్రద్ధలతో వారిని ప్రార్థించడం మంచిది.

మాట్లాడటం లేదా ఏదైనా చెప్పడం:

నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks