Swapna Shastra: చనిపోయిన వారు కలలో కనిపిస్తున్నారా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?
స్వప్న శాస్త్రం ప్రకారం, మరణించిన బంధువులు లేదా పూర్వీకులు కలలో కనిపించడం యాదృచ్ఛికం మాత్రమే కాదని, దానికి ఆధ్యాత్మిక, భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలు ఉంటాయని భావిస్తారు. వారు సంతోషంగా కనిపిస్తే శుభవార్తలు, ఆనందం, శ్రేయస్సుకు సూచనగా చెబుతారు.
ప్రతి ఒక్కరూ నిద్రపోయినప్పుడు కలలు కంటూ ఉంటారు. కొన్ని కలలు మనకు గుర్తుంటాయి, కానీ కొన్ని కలలను మర్చిపోతూ ఉంటాం. అయితే ఈ కలల ప్రపంచం ఎప్పుడూ రహస్యమయం, ఆసక్తికరంగానే ఉంటుంది. నిద్రలో చాలా రకాల దృశ్యాలు కనిపిస్తాయి. మరణించిన మన ప్రియమైన వారు లేదా బంధువులు కలలో కనపడితే మంచిదా, కాదా? దాని వల్ల నష్టాలు కలుగుతాయా, లాభాలు కలుగుతాయా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం ప్రకారం మరణించిన బంధువులు కలలో కనపడితే మంచిదా, కాదా?
స్వప్న శాస్త్రం ప్రకారం మరణించిన వారు కలలో కనపడితే అది యాదృచ్ఛికం మాత్రమే కాదు. దానికి ఆధ్యాత్మిక, భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలు ఉంటాయి. వారు కలలో వివిధ రూపాల్లో కనపడితే వాటి అర్థం ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
నవ్వుతూ లేదా సంతోషంగా:
చనిపోయిన పూర్వీకులు లేదా బంధువులు ఎవరైనా కలలో ఆరోగ్యంగా, సంతోషంగా, నవ్వుతూ కనపడితే చాలా మంచిది. వారి ఆత్మ ప్రశాంతంగా ఉందని, పరలోకంలో మంచి స్థానం లభించిందని అర్థం చేసుకోవాలి. అంతేకాదు, వారు మీ పట్ల సంతోషంగా ఉన్నారని, త్వరలో మీ జీవితం సంతోషంగా ఉండబోతుందని, శుభవార్తలు వినే అవకాశం కూడా ఉందని అర్థం చేసుకోవాలి.
ఏడుస్తూ లేదా బాధగా:
చనిపోయిన వారు ఎవరైనా ఏడుస్తూ లేదా బాధగా కలలో కనపడితే మంచిది కాదు. వారి ఆత్మకు ఏదైనా తీరని కోరిక ఉందని అర్థం చేసుకోవాలి. దానిని మీ ద్వారా నెరవేర్చాలని వారు కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కలలు వస్తే పితృదేవతల కోసం తర్పణాలు వదలడం, దానం, పిండప్రదానం వంటివి చేస్తే మంచిది.
మాట్లాడడం లేదా ఆశీర్వదించడం:
కొంత మంది చనిపోయిన వారు కలలో మాట్లాడడం లేదా ఆశీర్వదించడం లాంటివి కనబడితే, పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయని దీని వెనుక అర్థం. అలాగే వారి ఆశీర్వాదం లభించడం వల్ల భవిష్యత్తులో మీరు గొప్ప విజయాలను అందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి.
కోపంగా:
చనిపోయిన వారు కోపంగా కనపడినట్లయితే హెచ్చరికగా భావించాలి. మీరు తీసుకున్న ఏదైనా నిర్ణయం లేదా ప్రవర్తన పట్ల వారు అసంతృప్తి చెందారని, మీరు తప్పు మార్గంలోకి వెళ్లకుండా హెచ్చరిస్తున్నారని అర్థం. ఇలాంటి కల వస్తే మీ నిర్ణయాలు, ప్రవర్తనను ఒకసారి సమీక్షించుకోవడం మంచిది.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


