మకర సంక్రాంతి 2026: హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో మకర సంక్రాంతి (Sankranti 2026) ఒకటి. మకర సంక్రాంతి ముందు రోజున భోగి పండుగను జరుపుకుంటాము. అలాగే మకర సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటాము. సంక్రాంతిని పెద్ద పండుగ అని కూడా అంటాము. సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ నాడు పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు.

రకరకాల పద్ధతులు, ఆచారాలను పాటిస్తూ ఉంటారు. కోడిపందాలు, గాలిపటాలను ఎగరవేయడం, భోగినాడు భోగి (Bhogi 2026) మంటలు, చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం, రంగురంగుల ముగ్గులు వేయడం.. ఇలా సంక్రాంతి గురించి చెప్పుకుంటే చాలా ఉంది. హిందూ మతంలో ఇలాంటి ఉపవాసాలు, పండుగలు చాలా ఉన్నాయి. అయితే హిందువులు జరుపుకునే ప్రధానమైన పండుగల్లో సంక్రాంతి కూడా ఒకటి. ఇది ప్రతి ఏటా పుష్య మాసంలో వస్తుంది. ఆ రోజు సూర్యుడిని, విష్ణుమూర్తిని ఆరాధించడం వలన ఆరోగ్యంతో పాటు ఆనందం, సమృద్ధి కలుగుతాయి.
మకర రాశిలో సూర్యుడు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. ఈ పండుగ సూర్యుడిని చిహ్నంగా, కొత్త ప్రారంభానికి చిహ్నంగా భావిస్తారు.
మకర సంక్రాంతి 2026
జ్యోతిష్య లెక్కల ప్రకారం, హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి సంక్రాంతి పండుగ జనవరి 15న వచ్చింది. కొత్త సంవత్సరంలో అతిపెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ. సంక్రాంతి నాడు దానాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే స్నానాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో మకర సంక్రాంతిని జరుపుకుంటారు.
ప్రతి చోటా వివిధ పేర్లతో జరుపుకుంటారు. గుజరాత్లో దీనిని ఉత్తరాయణంగా జరుపుకుంటారు. అలాగే పంజాబ్లో లోహ్రీ, అస్సాంలో మాఘ్ బిహు, తమిళనాడులో పొంగల్ గా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఆ రోజున అనేక రాష్ట్రాల్లో గాలిపటాలను ఎగరవేసే సంప్రదాయం కూడా ఉంటుంది. చాలా చోట్ల కిచిడిని తయారు చేస్తారు. సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి ఈ రోజు నుంచి కదులుతాడని ఈ ప్రక్రియను ఉత్తరాయణం అని అంటారు. హిందూ మతంలో ఈ సమయం చాలా పవిత్రమైనదని అంటారు.
మకర సంక్రాంతి స్నాన, దానాలు
{{/usCountry}}ప్రతి చోటా వివిధ పేర్లతో జరుపుకుంటారు. గుజరాత్లో దీనిని ఉత్తరాయణంగా జరుపుకుంటారు. అలాగే పంజాబ్లో లోహ్రీ, అస్సాంలో మాఘ్ బిహు, తమిళనాడులో పొంగల్ గా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఆ రోజున అనేక రాష్ట్రాల్లో గాలిపటాలను ఎగరవేసే సంప్రదాయం కూడా ఉంటుంది. చాలా చోట్ల కిచిడిని తయారు చేస్తారు. సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి ఈ రోజు నుంచి కదులుతాడని ఈ ప్రక్రియను ఉత్తరాయణం అని అంటారు. హిందూ మతంలో ఈ సమయం చాలా పవిత్రమైనదని అంటారు.
మకర సంక్రాంతి స్నాన, దానాలు
{{/usCountry}}మకర సంక్రాతి నాడు గంగా లేదా యమునా వంటి పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఆ రోజు దానాలు ఇవ్వడం వలన కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. 2026 సంవత్సరం మకర సంక్రాంతి అనేక విధాలుగా ప్రత్యేకమైనదని చెప్పాలి.
హిందూ మతంలో మకర సంక్రాంతి నాడు దానాలు ఇవ్వడం వలన ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మకర సంక్రాంతి నాడు ముఖ్యంగా ఈ వస్తువులను దానం ఇస్తే మంచిది. గోధుమలు, బియ్యం, పప్పులు, ధాన్యాలు వంటి ఆహార ధాన్యాలను దానంగా ఇవ్వడం మంచిది. అలాగే బట్టలు, డబ్బు వంటివి పేదలకు విరాళంగా ఇస్తే మంచిది. ఆవులు, కుక్కలు, పక్షులకు ఆహారం పెడితే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. మకర సంక్రాంతి నాడు నువ్వులు, బెల్లం దానం చేస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది.
మకర సంక్రాంతి 2026 శుభ యోగాలు
మకర సంక్రాంతి నాడు సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సిద్ధి యోగంలో చేసిన అన్ని పనులు విజయాన్ని అందిస్తాయి. ఈ సమయంలో అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. అమృత సిద్ధి యోగంలో చేసే పని శాశ్వతమైనది, చాలా కాలం పాటు ప్రయోజనాలను ఇస్తుంది. మకర సంక్రాంతి నాడు ఈ అరుదైన యోగాల వలన పండుగ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. 2026 మకర సంక్రాంతి నాడు ఇచ్చిన దానాలు రెట్టింపు ఫలితాలను తీసుకొస్తాయి.