2026 January Festivals: మకర సంక్రాంతి, పుష్య అమావాస్య, వసంత పంచమి... జనవరి 2026 పండుగలు, ఉపవాసాలు పూర్తి లిస్ట్
మరి కొన్ని రోజుల్లో 2025 పూర్తి కాబోతోంది. 2026 రాబోతుంది. 2026 జనవరిలో అనేక పండుగలు, ఉపవాసాలు, శుభదినాలు ఉన్నాయి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ అయిన సంక్రాంతి కూడా జనవరిలోనే వస్తుంది. మకర సంక్రాంతిని పెద్ద పండుగ అని కూడా అంటారు. ఈ ఏడాది మకర సంక్రాంతి జనవరి 15న వచ్చింది. అలాగే ప్రధాన గ్రహాల సంచారంలో కూడా మార్పు ఉంది. దీంతో ద్వాదశ రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి.

మకర సంక్రాంతి 2026
మకర సంక్రాంతిని చాలా రాష్ట్రాలలో వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఈసారి మకర సంక్రాంతి జనవరి 15న వచ్చింది. భోగి పండుగ జనవరి 14న వచ్చింది. అలాగే కనుమ పండుగ జనవరి 16న వచ్చింది.
పుష్య అమావాస్య: పుష్య అమావాస్య నాడు గంగానదిలో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుంది. పాపాలన్నీ తొలగిపోతాయి.
వసంత పంచమి: వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ఆరాధిస్తారు. ఆ రోజు సరస్వతి దేవిని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. వసంత పంచమి నాడు చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి కూడా శుభ దినంగా భావిస్తారు. జనవరి 2026 ఉపవాసాలు, పండుగల పూర్తి లిస్ట్ ఇదిగో
జనవరి 1, 2026, గురువారం, ప్రదోష వ్రతం
జనవరి 3, 2026, శనివారం, పుష్య పూర్ణిమ
జనవరి 6, 2026, మంగళవారం, సంకటహర చతుర్థి
జనవరి 14, 2026, బుధవారం, భోగి, షట్టిల ఏకాదశి
జనవరి 15, 2026, గురువారం, మకర సంక్రాంతి
జనవరి 16, 2026, శుక్రవారం, కనుమ, ప్రదోష వ్రతం, మాస శివరాత్రి
జనవరి 17, 2026, శనివారం, ముక్కనుమ
జనవరి 18, 2026, ఆదివారం, పుష్య అమావాస్య
జనవరి 23, 2026, శుక్రవారం, వసంత పంచమి
జనవరి 25, 2026, ఆదివారం, రథసప్తమి
జనవరి 26, 2026, సోమవారం, భీష్మ అష్టమి
జనవరి 29, 2026, ఆదివారం, జయ ఏకాదశి
జనవరి 30, శుక్రవారం, ప్రదోష వ్రతం
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper












