సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడని, చేయాల్సిన వస్తువులు!
సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. అలా చేస్తే మీకు మంచి జరగదు. అంతేకాదు సాయంత్రంపూట కొన్ని వస్తువులు దానం చేస్తే మంచిది.
శాస్త్రాలు దానధర్మాల ప్రత్యేక ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. మత విశ్వాసాల ప్రకారం, సరైన సమయంలో చేసినప్పుడు మాత్రమే దానధర్మాలు ప్రతిఫలాన్ని ఇస్తాయి. సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను దానం చేయవద్దని కూడా శాస్త్రాలు సలహా ఇస్తున్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఏం దానం చేయాలో, ఏం చేయకూడదో చూడండి.

దానం మనసుకు శాంతిని చేకూర్చి, కుటుంబానికి సంతోషాన్ని, శ్రేయస్సును తెస్తుంది. హిందూమతంలో దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తెలియకుండా చేసిన పాపాల నుండి దానం చేయడం ద్వారా విముక్తి లభిస్తుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అయితే కొన్నిసార్లు తప్పుగా చేసిన దానాలు వివిధ సమస్యలకు దారితీయవచ్చు. కొన్నిసార్లు మనం తప్పుడు సమయంలో దానం చేస్తుంటాం. శాస్త్రాల ప్రకారం కొన్ని వస్తువులను సాయంత్రం పూట దానం చేయకూడదు.
సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత ఏ వస్తువునూ దానం చేయకూడదని తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రాలు దానధర్మాల కోసం సూర్యోదయం తర్వాత సమయాన్ని నిర్దేశిస్తున్నాయి. సూర్యోదయం సమయంలో చేసిన దానాలు పుణ్యాన్ని తెస్తాయి. అయితే రాత్రిపూట బంగారం, డబ్బు, ఆహారం మొదలైన వాటిని దానం చేయడం మానుకోవాలి.
సూర్యాస్తమయం తర్వాత బంగారం, డబ్బు, ఆహారాన్ని దానం చేస్తే మీకు మంచి జరగదు. వాటికి బదులుగా నల్ల నువ్వులు, ఆవ నూనె, మినప పప్పు, ఐరన్ వంటి శనికి సంబంధించిన వస్తువులను రాత్రిపూట దానం చేయవచ్చు. అలా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
అంతేకాకుండా రాత్రిపూట డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా దానం చేయడం ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది. ఇంకా బియ్యం వంటి ధాన్యాలను దానం చేయడం మానుకోవాలి. ఎందుకంటే అవి కూడా శుక్రుడితో సంబంధం కలిగి ఉంటాయి. సాయంత్రం ఈ వస్తువులను దానం చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోల్పోవడానికి దారితీస్తుంది. అంతేకాకుండా సాయంత్రం పసుపును దానం చేయడం కూడా మానుకోవాలి. ఇది మీ జాతకంలోని గురు గ్రహంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఉప్పును కూడా సాయంత్రం దానం చేయవద్దు. సాయంత్రం ఉప్పును దానం చేయడం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది.
ఇంకా శాస్త్రాలు సాయం కాలాన్ని లక్ష్మీదేవి సమయంగా వర్ణిస్తాయి. అంటే ఈ సమయంలో లక్ష్మీదేవి వచ్చి శ్రేయస్సును తెస్తుంది. అందువల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి దానాలు చేయవద్దు. ఒకవేళ దానం చేయాలనుకుంటే, సూర్యోదయం తర్వాత మాత్రమే చేయండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


