ఈ మంగళవారం పరిహారాలు చాలా శక్తివంతమైనవి.. హనుమంతుని ఆశీస్సులతో అపారమైన సంపదను పొందవచ్చు, కుజదోష ప్రభావం కూడా తగ్గుతుంది!

మంగళవారం నాడు హనుమంతుడిని ఆరాధించేటప్పుడు కొన్ని పరిహారాలను కూడా పాటించడం మంచిది. ఈ సులువైన పరిహారాలను మంగళవారం నాడు పాటించడం వలన జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు, అడ్డంకులు ఇవేమీ ఉండవు. ఆనందంగా పనులు పూర్తవుతాయి, సక్సెస్‌ను కూడా అందుకోవచ్చు.

Published on: Dec 16, 2025, 09:31:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వారంలో ప్రతి రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. మంగళవారం నాడు చూస్తే హనుమంతుని పూజిస్తారు. మంగళవారం నాడు హనుమంతుడిని ఆరాధించడం వలన హనుమంతుని ఆశీస్సులు కలిగి ఆనందంగా ఉండొచ్చు. హనుమంతుడి అనుగ్రహంతో భయమంతా తొలగి, విజయవంతంగా పనులను పూర్తి చేయొచ్చు. మంగళవారం నాడు హనుమంతుడిని ఆరాధించేటప్పుడు చాలా మంది హనుమాన్ చాలీసాను కూడా పఠిస్తారు.

ఈ మంగళవారం పరిహారాలు చాలా శక్తివంతమైనవి.. హనుమంతుని ఆశీస్సులతో అపారమైన సంపదను పొందవచ్చు (pinterest)
ఈ మంగళవారం పరిహారాలు చాలా శక్తివంతమైనవి.. హనుమంతుని ఆశీస్సులతో అపారమైన సంపదను పొందవచ్చు (pinterest)

అయితే మంగళవారం నాడు హనుమంతుడిని ఆరాధించేటప్పుడు కొన్ని పరిహారాలను కూడా పాటించడం మంచిది. ఈ సులువైన పరిహారాలను మంగళవారం నాడు పాటించడం వలన జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు, అడ్డంకులు ఇవేమీ ఉండవు. ఆనందంగా పనులు పూర్తవుతాయి, సక్సెస్‌ను కూడా అందుకోవచ్చు.

మంగళవారం నాడు ఈ పరిహారాలను పాటిస్తే ఏ సమస్యా ఉండదు

మంగళవారం నాడు హనుమంతుని ఆరాధించేటప్పుడు ఈ పరిహారాలను కూడా పాటిస్తే మంచిది. మంగళవారం నాడు ఏ సమస్యలైనా తొలగిపోవడానికి ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. స్నానం చేసిన తర్వాత ఎరుపు లేదా కాషాయ రంగు దుస్తులు ధరించండి. సాయంత్రం హనుమంతుడి ఫోటో పెట్టి దాని ముందు దీపారాధన చేయండి.

అందులో 5 లేదా 7 నువ్వులను వేయండి. తర్వాత 108 సార్లు “ఓం హనుమతే నమః” అనే మంత్రాన్ని జపించండి. ఇలా మంగళవారం నాడు పాటించినట్లయితే సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆనందంగా ఉండొచ్చు. హనుమంతుని ఆశీస్సులు కలుగుతాయి.

ప్రతికూల శక్తిని ఇలా తొలగించుకోండి

మంగళవారం నాడు ఇలా చేయడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ప్రతి మంగళవారం ఉదయం, సాయంత్రం కూడా దీపారాధన చేసి హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే నీళ్లలో కొంచెం నిమ్మరసం, ఉప్పు వేసి ఇంటిని శుభ్రపరచండి. ఆ నీటితో ఇంటిని తుడుచుకోవడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. ఆనందంగా ఉండొచ్చు.

ఆర్థిక సమస్యలను ఇలా తొలగించచ్చు

ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఒక రాగి నాణెం లేదా రూపాయి కాసుపై కుంకుమ లేదా సింధూరం పెట్టి దీనిని పూజ గదిలో పెట్టండి. తర్వాత హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాను పఠించండి. పూజ పూర్తయిన తర్వాత ఆ నాణేన్ని డబ్బులు దాచుకునే చోట పెట్టండి. ఇలా మంగళవారం నాడు చేయడం వలన ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. సులువుగా ఆర్థిక బాధల నుంచి బయటపడొచ్చు.

కుజ దోషం

చాలా మంది కుజ దోషంతో బాధ పడతారు. కుజదోషం ఉన్నవారు వైవాహిక జీవితంలో ఆనందం కలగడానికి, వివాహం జరగడానికి ఈ పరిహారాన్ని పాటించొచ్చు. మంగళవారం నాడు స్నానం చేసిన తర్వాత హనుమంతుడికి సింధూరంతో పూజ చేయండి. “ఓం క్రమ్ క్రీమ్ క్రోమ్ సహా భౌమాయ నమః” అనే మంత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వలన హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. కుజదోష ప్రభావం కూడా తగ్గుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More