ఈ రాశుల అమ్మాయిలు చాలా రొమాంటిక్.. వారి భాగస్వామిని వదిలి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు!
ఒక్కో రాశి వారి వ్యక్తిత్వం, తీరు ఒక్కో విధంగా ఉంటుంది. ప్రేమికుల రోజు జరుపుకునే ఫిబ్రవరి నెల రాబోతోంది. ఇప్పటికే భాగస్వామిని సంతోషపెట్టడానికి చాలామంది ప్రణాళికలు వేసుకుని ఉంటారు. ఈ రాశుల వారు మాత్రం చాలా రొమాంటిక్‌గా ఉంటారు. వారి భాగస్వామిని వదిలి వెళ్లడానికి ఏ మాత్రం ఇష్టం ఉండదు.
రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు, ప్రవర్తన ఎలా ఉన్నాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఒక్కో రాశి వారి వ్యక్తిత్వం, తీరు ఒక్కో విధంగా ఉంటుంది. ప్రేమికుల రోజు జరుపుకునే ఫిబ్రవరి నెల రాబోతోంది. ఇప్పటికే భాగస్వామిని సంతోషపెట్టడానికి చాలామంది ప్రణాళికలు వేసుకుని ఉంటారు. ఈ రాశుల వారు మాత్రం చాలా రొమాంటిక్‌గా ఉంటారు. వారి భాగస్వామిని వదిలి వెళ్లడానికి ఏ మాత్రం ఇష్టం ఉండదు.

ఒక్కో రాశి వారు ఒక్కో విధంగా ఉంటారు. అయితే, ఈ రాశుల వారు మాత్రం చాలా రొమాంటిక్‌గా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల అమ్మాయిలు తమ ప్రేమను బాగా వ్యక్తపరుస్తారు. అలాగే రొమాంటిక్‌గా ఉంటారు. వారి భాగస్వామి నుంచి దూరంగా ఉండడం కూడా వారికి ఏమాత్రం నచ్చదు.
ఈ రాశుల వారు చాలా రొమాంటిక్.. వారి భాగస్వామిని వదిలి వెళ్ళరు
1.వృషభ రాశి
వృషభ రాశి అమ్మాయిలు చాలా రొమాంటిక్‌గా ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి అమ్మాయిలు ఎప్పుడూ కూడా తమ జీవిత భాగస్వామిని వదిలిపెట్టి ఉండడానికి ఇష్టపడరు. వీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి ఇతరులు కూడా సులువుగా ఆకర్షితులవుతారు.
2.కర్కాటక రాశి
కర్కాటక రాశి అమ్మాయిలు తమ భాగస్వామితో ఎంతో ప్రేమగా, రొమాంటిక్‌గా ఉంటారు. సులువుగా ఇతరులకు ఫిదా అయిపోతారు. అలాగే మంచి జీవిత భాగస్వామిగా, భార్యగా పేరు తెచ్చుకుంటారు. జీవిత భాగస్వామిని ఎంతో ఇష్టపడతారు.
3.సింహ రాశి
సింహ రాశి అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉంటారు. ప్రేమ విషయంలో వీరికి కొన్ని హద్దులు ఉన్నప్పటికీ, ధైర్యంగా వాటిని దాటుతారు. జీవిత భాగస్వామికి సపోర్ట్ ఇస్తారు. అలాగే ఎంతో రొమాంటిక్‌గా ఉంటారు. ఒకసారి ఎవరినైనా ఇష్టపడితే వారితో ఎంతో సంతోషంగా జీవిస్తారు.
4.తులా రాశి
తులా రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి అమ్మాయిలు కూడా చాలా రొమాంటిక్‌గా ఉంటారు. వీరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామిని వదిలిపెట్టి ఉండడానికి ఇష్టపడరు.
5.మీన రాశి
మీన రాశికి అధిపతి గురువు. మీన రాశి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ప్రేమ, రొమాన్స్ విషయంలో కూడా మంచిగా ఉంటారు. తమ భాగస్వామిని ఎంతో ఇష్టపడతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


