గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది శుభ యోగాలను, అశుభ యోగాలను తీసుకువస్తుంది. ఒక్కోసారి రెండు మూడు గ్రహాల సంయోగం కూడా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు కొన్నిసార్లు ప్రత్యేక స్థానాలలో ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి.
కేంద్ర దృష్టి యోగం

డిసెంబర్ 9న శని, కుజుడు 90 డిగ్రీల కోణంలో ఉంటారు. దీంతో కేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశులు మీరు ఒకరేమో చూసుకోండి.
శని, కుజుల కేంద్ర దృష్టి యోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం
1.సింహ రాశి
సింహ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ యోగం కారణంగా ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. భూములు, ఆస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాల నుంచి డబ్బు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు.
2.మేష రాశి
మేష రాశి వారికి కేంద్ర దృష్టి యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది.
3.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ యోగం అనేక విధాలుగా లాభాలను తీసుకు వస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సమాజంలో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. సీనియర్ల నుంచి సపోర్ట్ ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి.
4.ధనుస్సు రాశి
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి ఈ యోగం అనేక విధాలుగా లాభాలను తీసుకు వస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సమాజంలో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. సీనియర్ల నుంచి సపోర్ట్ ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి.
4.ధనుస్సు రాశి
{{/usCountry}}ధనుస్సు రాశి వారికి యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది మంచి సమయం. ఆర్థిక స్థిరత్వాన్ని చూస్తారు. అనేక లాభాలు కలుగుతాయి.
5.మకర రాశి
మకర రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త ప్రాపర్టీలను కొనుగోలు చేస్తారు. ఆర్థికపరంగా బావుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. ఈ రాశి వారు ఈ శక్తివంతమైన యోగం కారణంగా అదృష్టాన్ని కూడా పొందుతారు.