మరి కొన్ని రోజుల్లో ఈ రాశుల వారి జీవితమే మారిపోతుంది.. శని, కుజుల అనుగ్రహంతో డబ్బు, వాహనాలు, ఆస్తులతో పాటు బోలెడు లాభాలు

జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు కొన్నిసార్లు ప్రత్యేక స్థానాలలో ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. డిసెంబర్ 9న శని, కుజుడు 90 డిగ్రీల కోణంలో ఉంటారు. దీంతో కేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుంది. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది.

Published on: Nov 27, 2025, 09:16:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది శుభ యోగాలను, అశుభ యోగాలను తీసుకువస్తుంది. ఒక్కోసారి రెండు మూడు గ్రహాల సంయోగం కూడా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు కొన్నిసార్లు ప్రత్యేక స్థానాలలో ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి.

మరి కొన్ని రోజుల్లో ఈ రాశుల వారి జీవితమే మారిపోతుంది (pinterest)
మరి కొన్ని రోజుల్లో ఈ రాశుల వారి జీవితమే మారిపోతుంది (pinterest)

కేంద్ర దృష్టి యోగం

డిసెంబర్ 9న శని, కుజుడు 90 డిగ్రీల కోణంలో ఉంటారు. దీంతో కేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశులు మీరు ఒకరేమో చూసుకోండి.

శని, కుజుల కేంద్ర దృష్టి యోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం

1.సింహ రాశి

సింహ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ యోగం కారణంగా ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. భూములు, ఆస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాల నుంచి డబ్బు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు.

2.మేష రాశి

మేష రాశి వారికి కేంద్ర దృష్టి యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది.

3.వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ యోగం అనేక విధాలుగా లాభాలను తీసుకు వస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సమాజంలో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. సీనియర్ల నుంచి సపోర్ట్ ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి.

4.ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది మంచి సమయం. ఆర్థిక స్థిరత్వాన్ని చూస్తారు. అనేక లాభాలు కలుగుతాయి.

5.మకర రాశి

మకర రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త ప్రాపర్టీలను కొనుగోలు చేస్తారు. ఆర్థికపరంగా బావుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. ఈ రాశి వారు ఈ శక్తివంతమైన యోగం కారణంగా అదృష్టాన్ని కూడా పొందుతారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More