...
...
Next Story

ఈ సంక్రాంతితో 4 రాశుల వారి కష్టాలన్నీ తీరిపోతాయి.. ఆదిత్య-కుజ యోగంతో డబ్బు, కొత్త ఇల్లు, వాహనాలు ఇలా ఎన్నో!

2026 చాలా అద్భుతమైన సంవత్సరం. చాలా శుభయోగాలు కొత్త సంవత్సరం ఏర్పడబోతున్నాయి. శని రాశి అయినటువంటి మకర రాశిలో సూర్య, కుజ కలయిక చోటు చేసుకోనుంది. మకర రాశిలో ఆదిత్య–కుజయోగం ఏర్పడి కొన్ని రాశుల వారికి అద్భుతంగా మారబోతోంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు?

Published on: Nov 19, 2025, 13:30:16 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. 2025 త్వరలోనే పూర్తి కాబోతోంది, 2026 రాబోతోంది. 2026లో కొన్ని శుభ యోగాలు ఏర్పడడం జరుగుతుంది. సూర్యుడు, కుజుడు 2026లో సంయోగం చెందుతాయి. ఈ రెండు గ్రహాల సంయోగంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి.

అద్భుతమైన యోగాలు

ఈ సంక్రాంతితో 4 రాశుల వారి కష్టాలన్నీ తీరిపోతాయి (pinterest)
ఈ సంక్రాంతితో 4 రాశుల వారి కష్టాలన్నీ తీరిపోతాయి (pinterest)

2026 చాలా అద్భుతమైన సంవత్సరం. చాలా శుభయోగాలు కొత్త సంవత్సరం ఏర్పడబోతున్నాయి. శని రాశి అయినటువంటి మకర రాశిలో సూర్య, కుజ కలయిక చోటు చేసుకోనుంది. సూర్య–కుజుల సంయోగం 2026 జనవరి 14న గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో మకర సంక్రాంతి వస్తుంది. మనం ఎంతో ఘనంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటాము.

ఆ తర్వాత రెండు రోజులకు అంటే జనవరి 16న కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ రెండు సంయోగం చెందుతాయి. మకర రాశిలో ఆదిత్య–కుజయోగం ఏర్పడి కొన్ని రాశుల వారికి అద్భుతంగా మారబోతోంది. ఈ రాశుల వారు ఈ సమయంలో చాలా రకాల ప్రయోజనాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశి వారు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.

సంక్రాంతి తర్వాత రెండు రోజులకు ఆదిత్య కుజ యోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం

1.మేష రాశి

మేష రాశి వారికి రెండు గ్రహాల కలయిక శుభఫలితాలను తీసుకువస్తుంది. 2026 ప్రారంభంలోనే ఈ యోగం ఏర్పడడంతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు.పని ప్రదేశంలో సక్సెస్ ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. ఆర్థికపరంగా లాభాలను పొందుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.

2.వృషభ రాశి

తులా రాశి వారికి ఈ రెండు గ్రహాల సంయోగం బాగా కలిసి వస్తుంది. అద్భుతంగా ఉంటుంది. కొత్త ఇల్లు, వాహనాలు, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం వుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి.

4.మకర రాశి

మకర రాశి వారికి రెండు గ్రహాల సంయోగం మంచి ఫలితాలను తీసుకొస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు లేదా వ్యాపారం మొదలుపెట్టడానికి శుభసమయం. పెళ్లి కానివారికి పెళ్లి కుదిరే అవకాశం వుంది. మొత్తం మీద అనేక విధాలుగా లాభాలను పొందుతారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks