ఈ రాశుల వారికి వెండి వలన అశుభ ఫలితాలే కలుగుతాయి, కాబట్టి పొరపాటున కూడా ధరించకండి!

లోహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం లోహాలను ధరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంగారం శక్తి, తెలివితేటలు వంటి వాటిని అందిస్తుంది. వెండి శుక్రుడు, చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. కొన్ని రాశుల వారు వెండి ధరిస్తే బాగా కలిసి వస్తుంది. 

Published on: Feb 10, 2026, 13:30:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండిని ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తారు. అయితే కొన్ని రాశుల వారు మాత్రం వెండిని ధరించకుండా ఉండడమే మంచిదని అంటారు. ఏ రాశుల వారికి వెండి కలిసి రాదు? ఎవరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

ఈ రాశుల వారికి వెండి వలన అశుభ ఫలితాలే కలుగుతాయి (pinterest)
ఈ రాశుల వారికి వెండి వలన అశుభ ఫలితాలే కలుగుతాయి (pinterest)

లోహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం లోహాలను ధరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంగారం శక్తి, తెలివితేటలు వంటి వాటిని అందిస్తుంది. వెండి శుక్రుడు, చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. కొన్ని రాశుల వారు వెండి ధరిస్తే బాగా కలిసి వస్తుంది. పైగా వెండి నేరుగా ఆరోగ్యం, మానసిక సమతుల్యత, సానుకూల శక్తిపై ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే వెండి కొన్ని రాశుల వారు ధరిస్తే బాగా కలిసి వస్తుంది. మరి ఏ రాశుల వారికి వెండి బాగా కలిసి వస్తుందో తెలుసుకుందాం.

వెండి ధరిస్తే ఏమవుతుంది?

వెండిని ధరించడం వలన గ్రహాలన్నీ కూడా సమతుల్యంగా ఉంటాయి. ముఖ్యంగా చంద్రుడు, శుక్రుడిని దృఢంగా మార్చవచ్చు. దాంతో సానుకూల ఫలితాలను చూడొచ్చు. మానసిక ప్రశాంతత, ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటుంది. ఆనందం కూడా పెరుగుతుంది. సంపద, గౌరవ మర్యాదలు ఎక్కువవుతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్రతికూల శక్తి నుంచి రక్షణ లభిస్తుంది.

వెండిని ధరించడం వలన ఈ రాశులకు బాగా కలిసి వస్తుంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు వెండిని ధరించడం వలన బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి, తులా రాశి, మీన రాశి వారికి చక్కటి మార్పులు తీసుకు వస్తుంది. సానుకూల శక్తిని ప్రవహించేలా చేస్తుంది. ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది.

వెండి ఈ రాశులకు కలిసి రాదు

మేష రాశి, సింహ రాశి, ధనస్సు రాశి వారు వెండిని ధరించడం మంచిది కాదు. ఒకవేళ ధరించాలి అనుకుంటే జ్యోతిష్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఈ రాశుల వారికి వెండి అదృష్టం తగ్గిస్తుంది, సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

ఆయుర్వేదం ప్రకారం వెండి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

వెండిని చాలా మంచి లోహంగా భావిస్తారు. వెండి ధరించడం వలన దోషాలు సమతుల్యంగా ఉంటాయి. వాత, పిత్త, కఫ దోషాలను బ్యాలెన్స్ చేయవచ్చు. దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి ఎక్కువ అవుతుంది.

మగవారు వెండి ఉంగరాన్ని ఏ చేతికి ధరిస్తే మంచిది?

మగవారు వెండి ఉంగరాన్ని ధరించేటప్పుడు కుడి చేతికి పెట్టుకోవడం మంచిది. అలాగే వెండి బ్రేస్‌లెట్ లేదా కడియాన్ని కూడా ధరించవచ్చు. కుడి చేతికి పెట్టుకుంటే శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More