Weekly Lucky Rasis: ఈ వారం ఈ రాశుల వారికి గ్రహాల అనుకూలంతో విపరీతమైన లాభాలు, అదృష్టం, సంపద డబుల్!
ఫిబ్రవరిలో వచ్చిన కొత్త వారం కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందబోతున్నారు. ఈ రాశుల వారికి వివిధ ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వారంలో సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు, బుధుడు, రాహువు కూడా ఇదే రాశిలో ఉన్నారు.
ప్రతి నెల, ప్రతి వారం కూడా కొన్ని గ్రహాల సంచారంలో మార్పులు వస్తూనే ఉంటాయి. ఫిబ్రవరిలో వచ్చిన కొత్త వారం కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తీసుకు రాబోతోంది. ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందబోతున్నారు. ఈ రాశుల వారికి వివిధ ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ వారంలో సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు, బుధుడు, రాహువు కూడా ఇదే రాశిలో ఉన్నారు. ఇప్పుడు సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించడంతో చాతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. పైగా ఈ వారం విజయ ఏకాదశి, ప్రదోష వ్రతం, మహాశివరాత్రి కూడా ఉన్నాయి.
అలాంటి సమయంలో కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలగబోతోంది. గ్రహాల అనుగ్రహంతో పాటు దేవతల అనుగ్రహం కూడా కలగబోతోంది. మరి ఏ రాశుల వారికి అదృష్టం పెరగబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో? ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వారం ఈ రాశుల వారికి విపరీతమైన లాభాలు.. కొత్త ఉద్యోగాలు, అదృష్టం, డబ్బుతో పాటు ఎన్నో
1.మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం చాలా బాగా కలిసి వస్తుంది. మేష రాశి వారు ఇంట్లో, బయట కూడా సహాయ సహకారాలను పొందుతారు. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారి రిలేషన్‌షిప్‌లో ఆనందం పెరుగుతుంది.
కొత్త ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది. వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి. విదేశాల్లో పని చేసే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఈ వారం ఈ రాశి వారు సంతోషంగా ఉండడానికి చాలీసా రోజూ చదవడం మంచిది. అలాగే దుర్గాదేవిని ఆరాధించాలి.
2.కన్య రాశి
కన్య రాశి వారికి ఈ సమయంలో అదృష్టం పెరుగుతుంది. శుభవార్తలను వింటారు. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం బాగా కలిసి వస్తాయి.
గ్రహాల అనుకూలతతో ఈ రాశి వారి వ్యాపారం కూడా బాగుంటుంది. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఇది శుభ సమయం. హనుమంతుని ఆరాధిస్తే ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది.
3.కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారి ఆనందం పెరుగుతుంది. అపార్థాలు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. టీచర్లకు ఈ వారం బాగా కలిసి వస్తుంది.
ఉద్యోగస్తులు కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. హనుమంతుడిని పూజించి, చాలీసాను ఏడు సార్లు చదువుకుంటే మీకు అద్భుతంగా కలిసి వస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


