...
...
Next Story

ఈ రాశుల వారు వ్యాపారంలో దూసుకెళ్ళిపోతారు, ఓటమే ఉండదు!

రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయి అనేది చెప్పడంతో పాటు వారి భవిష్యత్తు గురించి కూడా చెప్పచ్చు. కొన్ని రాశుల వారిలో కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. అలాగే కొన్ని రాశుల వారికి కొన్ని బలాలు ఉంటే అవి మరొకరి బలహీనతలు అవ్వచ్చు. అయితే ఈ రాశుల వారు మాత్రం వ్యాపారంలో నెంబర్ వన్.

Published on: Nov 18, 2025, 08:00:06 IST
Advertisement

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయి అనేది చెప్పడంతో పాటు వారి భవిష్యత్తు గురించి కూడా చెప్పచ్చు. కొన్ని రాశుల వారిలో కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. అలాగే కొన్ని రాశుల వారికి కొన్ని బలాలు ఉంటే అవి మరొకరి బలహీనతలు అవ్వచ్చు. అయితే ఈ రాశుల వారు మాత్రం వ్యాపారంలో నెంబర్ వన్. ఎప్పుడూ కూడా వ్యాపారంలో వీరికి బాగా కలిసి వస్తుంది, ఎక్కువ లాభాలను పొందుతారు. మరి ఆ రాశుల వారు ఎవరు? మీకు కూడా వ్యాపారం కలిసి వస్తుందా? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.

ఈ రాశులు వారు వ్యాపారంలో నెంబర్ 1

1.సింహ రాశి

ఈ రాశులు వారు వ్యాపారంలో నెంబర్ 1 (pinterest)
ఈ రాశులు వారు వ్యాపారంలో నెంబర్ 1 (pinterest)

సింహ రాశి వారు పుట్టుకతోనే గొప్ప నాయకులు. సింహ రాశి వారు ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు. అలాగే సృజనాత్మకంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇతరుల దృష్టి వీరిని ఆకట్టుకుంటుంది, ఎల్లప్పుడూ వెలుగును ప్రకాశవంతం చేస్తూనే ఉంటారు.

ఈ రాశి వారిలో మంచి వ్యవస్థాపకుని లక్షణాలు ఉంటాయి. అలాగే ఇతరులకు స్ఫూర్తినిస్తారు. మీరు తెలివితేటలతో, ఆలోచనలతో వ్యాపారం లేదా సంస్థకు నాయకత్వం వహించి విజయాన్ని అందుకోగలరు. అలాగే ఈ రాశి వారి మాటకు కూడా ఇతరులు విలువ ఇస్తారు.

2.మకర రాశి

మకర రాశి వారు ఎంతో కష్టపడే పని చేస్తారు. ఈ రాశి వారు ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెడితే కచ్చితంగా సక్సెస్‌ను అందుకుంటారు. ఏదైనా ఇబ్బంది వస్తే అనుభవజ్ఞులైన వారిని కలిసి సలహా తీసుకొని పాటిస్తారు. వృత్తి, వ్యాపారంలో సక్సెస్‌ను అందుకుంటారు. వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. సమస్యలకు ఏ మాత్రం భయపడరు. వృత్తి, వ్యాపారంలో ఓటమి ఉండదు.

3.వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు వేగం, తెలివితేటలు, నైపుణ్యం కలిగి ఉంటారు. ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడం వీరికి బాగా తెలుసు. మానసిక స్థితి దృఢంగా ఉంటుంది. బలమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికోసం నిరంతరం శ్రమిస్తారు. చాకచక్యంగా మాట్లాడే సామర్థ్యము కూడా ఉంది. కొత్త సంబంధాలను, స్నేహితులను బాగా అర్థం చేసుకునే సామర్థ్యం ఉండడంతో వ్యాపారంలో దూసుకు వెళ్ళిపోతారు.

4.కన్య రాశి

మేష రాశి వారు గొప్ప నాయకులు, ధైర్యవంతులు. అలాగే ఈ రాశి వారు పోటీ స్వభావం కలిగి ఉంటారు. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోరు. ప్రమాదాన్ని ముందే గ్రహించగలరు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువగా వస్తుంది. కాబట్టి కొంచెం ప్రశాంతంగా వ్యవహరించడం మంచిదే.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks