...
...
Next Story

మూడు గ్రహాల అద్భుత సంయోగం.. ఆగస్టు 31 వరకు ఈ 3 రాశులకు శుభకాలం.. పట్టిందల్లా బంగారమే!

గ్రహాల రాశి, నక్షత్ర సంచారాల్లో మార్పులు అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం సూర్యుడు, బుధుడు, కేతువు మఘా నక్షత్రంలో సంచారం చేయడంతో మూడు గ్రహాల సంయోగం ఏర్పడింది. ఈ యోగం ఆగస్టు 31 వరకు కొనసాగనుంది.

Published on: Aug 28, 2026, 08:00:51 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. ఒక్కోసారి గ్రహాల మార్పు కారణంగా శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మూడు గ్రహాల అద్భుత సంయోగం.. ఆగస్టు 31 వరకు ఈ 3 రాశులకు శుభకాలం.. పట్టిందల్లా బంగారమే! (AI)
మూడు గ్రహాల అద్భుత సంయోగం.. ఆగస్టు 31 వరకు ఈ 3 రాశులకు శుభకాలం.. పట్టిందల్లా బంగారమే! (AI)

గ్రహాల రాజు సూర్యుడు, బుధుడు మఘా నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. కేతువు కూడా ఇదే నక్షత్రంలో ఉండడంతో అద్భుతమైన గ్రహసంయోగం ఏర్పడబోతోంది. ప్రస్తుతం గ్రహాలకు రాజు సూర్యుడు, రాజకుమారుడు బుధుడు మఘా నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. కేతువు కూడా మఘా నక్షత్రంలో సంచారం చేస్తుండడంతో మూడు గ్రహాలు మఘా నక్షత్రంలో సంయోగం చెందాయి. ఈ యోగం ఆగస్టు 31 వరకు ఉంటుంది. తర్వాత సూర్యుడు తదుపరి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అప్పటివరకు కూడా కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది.

జ్యోతిష్యం ప్రకారం, ఈ మూడు శక్తివంతమైన గ్రహాలు ఒకే నక్షత్రంలో ఉండడంతో అన్ని రాశులపై భిన్నమైన ప్రభావాలు కనిపిస్తాయి. కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు భారీగా కలిగే అవకాశం ఉంది. మరి, ఈ సమయంలో ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఆ అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.

మఖ నక్షత్రంలో సూర్య, బుధ, కేతువుల కలయిక.. ఈ రాశుల వారికి పండగే

1.తులా రాశి

తులా రాశి వారికి ఈ మూడు గ్రహాలు ఒకే నక్షత్రంలో ఉండడంతో భారీగా లాభాలు కలగబోతున్నాయి. ఈ రాశి వారు కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరీర్‌లో దూసుకుపోతారు. కొత్త అవకాశాలు లభించడంతో అన్ని విధాలుగా లాభాలు కలుగుతాయి. పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికల్లో మంచి రాబడి పొందే అవకాశం ఉంది.

కర్కాటక రాశి వారికి ఇది శుభ సమయం. ప్రభుత్వ రంగంలో బాగా రాణిస్తారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారు చక్కగా పూర్తి చేస్తారు.

కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది. ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. కష్టానికి తగ్గ ఫలితాలను పొందుతారు. కొత్త పనిని ప్రారంభించడానికి కూడా ఇది మీకు అనుకూల సమయం. ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు లభిస్తాయి.

3.మకర రాశి

రాశి వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. పెట్టుబడి ద్వారా భారీగా లాభాలను పొందుతారు. కెరీర్‌కు సంబంధించి ముందుకు వెళ్తారు. ఆర్థిక పరిస్థితి దృఢంగా మారుతుంది.

ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో కష్టానికి తగ్గ ప్రశంసలు లభిస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe